ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాలో విస్తారంగా వర్షాలు

ABN, Publish Date - May 27 , 2025 | 11:41 PM

జిల్లాలో విస్తారంగా వర్షాలు

చాగలమర్రిలో పట్టపై నిలిచిన వర్షపునీరు

రుద్రవరం మండలంలో 47.8 ఎం.ఎం., వర్షపాతం

నంద్యాల ఎడ్యుకేషన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల రాకతో మంగళవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. రుద్రవరం మండలంలో అత్యధికంగా 47.8ఎంఎం వర్షపాతం నమోదైంది. శిరువెళ్లలో 35.0, గోస్పాడు 33.4, మహానంది 29.2, ప్యాపిలి 25.4, డోన్‌ 23.4, కోవెలకుంట్ల 23.2, బండిఆత్మకూరు 19.0, ఆళ్లగడ్డ 17.8, దొర్నిపాడు 16.6, నంద్యాల 15.8, కొలిమిగుండ్ల 11.0, ఉయ్యాలవాడ 10.4, నందికొట్కూ రు 9.2, చాగలమర్రి 9.2, కొత్తపల్లె 8.0, బేతంచర్ల 7.2, బనగానపల్లె 6.4, వెలుగోడు 5.2, సంజామల 4.2, జూపాడుబంగ్లా 3.8, ఆత్మకూరు 3.8, పాములపాడు 3.8, పగిడ్యాల 3.6, మిడ్తూరు 2.8, పాణ్యం 2.0, అవుకు 1.6, గడివేముల 1.0, శ్రీశైలం 0.4 ఎంఎం వర్షపాతం నమోదైంది.

రైతులకు శాస్త్రవేత్తల సూచనలు

రుతుపవనాలు ముందుగా రావడంతో శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. వర్షాధారంగా సాగుచేసే వేరుశనగ, కంది, ఆముదం, పత్తి సాగు చేసే రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ వాతావరణ విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ నారాయణస్వామి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ్‌శంకర్‌బాబు, రీసర్చ్‌ అసోసియేట్‌ డాక్టర్‌ ఉమాదేవి సూచిస్తున్నారు. అలాగే వర్షాధార పంటలు వేసుకునేందుకు జూన్‌, జులై మాసాలు అనుకూలంగా ఉంటాయని, రైతులు ప్రస్తుతం తేమ ఉండటంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాలని సూచించారు. ఖరీ్‌ఫలో వరి సాగుచేసే రైతులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న తేమను వినియోగించుకుని పచ్చిరొట్ట పంటలను సాగు చేసుకోవాలన్నారు. పత్తి, వేరుశనగ పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలని, సిఫార్సు మేరకు ఎరువులను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జూన్‌, జూలైలో కనీసం 60ఎంఎం నుంచి 70ఎంఎం వర్షం కురిసిన తర్వాత విత్తనం నాటుకుంటే భూమిలో వేడి తగ్గి మొలకశాతం అధికంగా ఉంటుందన్నారు. జూలై 15లోపు సామూహికంగా విత్తుకుంటే గులాబీరంగు పురుగు ఉధృతి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:41 PM