ఆరోగ్య యోగం
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:07 AM
యోగాతో ఆరోగ్యం వస్తుందని, దేశ వారసత్వ సంపద అని, భావితరాలకు అందిచాలని తీసుకెళ్లే సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ మైదానంలో అంతర్జాతీయ యోగాడే నిర్వహించారు. యోగా శిక్షకుడు ఆసనాలు, ప్రాణాయామాలను చేయించారు.
ఆదోని, పత్తికొండ,ఆలూరు నియోజకవర్గాల్లో యోగా డే
ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు
ఆదోని, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): యోగాతో ఆరోగ్యం వస్తుందని, దేశ వారసత్వ సంపద అని, భావితరాలకు అందిచాలని తీసుకెళ్లే సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ మైదానంలో అంతర్జాతీయ యోగాడే నిర్వహించారు. యోగా శిక్షకుడు ఆసనాలు, ప్రాణాయామాలను చేయించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణ, చైర్‌పర్సన్ లోకేశ్వరి, ఎంవీఐ శిశిరదీప్తి, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ షఫీఉల్లా, అధికారులు పాల్గొన్నారు.
పత్తికొండ: పట్టణంలోని తేరుబజబార్ మీటింగ్ కట్టవద్ద ఎమ్మెల్యే శ్యాంబాబు యోగాసనాలు వేశారు. ఎంపీడీవో కవిత అధ్యక్షత తన యోగా ట్రైనర్ రంగస్వామి యోగాభ్యాసం చేయించారు. ఆర్డీవో భరత్‌నాయక్, డిఎల్‌పీవో వీరభద్రప్ప, సీఐ జయన్న, తహసీల్దార్ నూర్‌అహ్మద్, ఎపీవో వెంకటేశ్వర్లు, డిప్యూటి ఎంపిడివో నరసింహులు, అధికారులు, సచివాలయ సిబ్బంది. గ్రామపంచాయితీ సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా శిక్షకుడు రంగస్వామి రచించిన ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఆదోని అగ్రికల్చర్: ఆర్‌ఆర్ లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠ శాలలో హెచ్‌ఎం రవి అధ్యక్షతన నిర్వ హించారు. ద్వారకా హాల్‌లో న్యాయ సేవా సాధికార సంస్థ నిర్వహించిన యోగాలో ఆదోని సీనియర్ సవిల్ న్యాయాధికారి సుధ పాల్గొన్నారు.
పత్తికొండ టౌన్: యోగా చేస్తే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని ఎంఈవో వెంకట్రాముడు, రఘుశేఖర్, రాజశేఖర్‌ల అన్నారు. నలకదొడ్డి గ్రామంలో ప్రజలతో కలిసి యోగాసనాల చేశారు. హెచ్‌ఎం హుల్తప్ప, సూర్యప్రకాష్ రెడ్డి, రోశన్, వసుంధర, భానుప్రకాష్ పాల్గొన్నారు.
మద్దికెర: యోగా సాధనతో ఆరోగ్యం వస్తుందని తహసీల్దార్ గుండాల్ నాయక్, ఎంఈవో రంగస్వామి, డిప్యూటీ ఎంపీడీవో శివకుమార్ అన్నారు. బుధవారంమద్దికెర, ఎం.అగ్రహారం, పెరవలి, బురుజుల తదితర గ్రామాల్లో యోగా నిర్వహించారు. జడ్పీటీసీ మురళిరెడ్డి, ఎంపీపీ అనిత, సర్పంచ్ బండారు సుహాసిని, టీడీపీ నాయకులు రాజన్న యాదవ్, ధనుంజయుడు, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
తుగ్గలి: యోగాతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఎంపీడీవో విశ్వమోహన్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు వరలక్ష్మి, తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మనోహర్ చౌదరి, టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు అన్నారు. శనివారం మండలంలో ని ఆ గ్రామాల్లో యోగా చేశారు. వైద్యులు అమర్నాథ్, ఏవో సురేష్‌బాబు పాల్గొన్నారు.
దేవనకొండ: జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం యోగాంధ్ర కార్యక్రమంలో ప్రత్యేక అధికారి విజయ, తహసీల్దార్ రామాంజీనేయలు, ఎంపీడీవో బీవీ రమణరావు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద గ్రామస్తులతో కలసి అధికారులు యోగాసనాలు వేశారు.
ఆదోని రూరల్: మండలంలోని సంతెకుడ్లూరు గ్రామంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో శేఖర్, డిప్యూటీ ఎంపీడీవో జనార్థన్ తెలిపారు.
వెల్దుర్తి: యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలని ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కస్తూర్బా పాఠశాలలో మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌గౌడ్, డాక్టర్ భారతి, ఎస్‌వో షాకీరాబేగంతో పాల్గొన్నారు. జ్యోతిబాపూలే గురుకులంలో సుబ్బరాయుడు, ఎంపీడీవో సుహాసినమ్మ, తెలుగు యువత అధ్యక్షుడు సుధాకర్‌గౌడ్ యోగా చేశారు. అంబేడ్కర్ గురుకుల పాఠశాల, వెల్దుర్తి జడ్పీ హైస్కూల్‌లో కన్వీనర్ బలరాంగౌడు, తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసూన పాలొన్నారు.
క్రిష్ణగిరి: పత్తికొండ మార్కెట్ యార్డు చైర్మన్ ఆలంకొండ నబీ సాహెబ్, కటారుకొండ మర్రి శ్రీరాములు, తహసీల్దార్ ప్రకాష్‌బాబు, ఎంపీడీవో మోహన్‌కుమార్, ఎంపీడీవో సునంద, ఈవోఆర్డీ లచ్చప్ప పాల్గొన్నారు.
చిప్పగిరి: మండల కేంద్రంలో ప్రత్యేకాధికారి రంగనాథ్ బాబు, సర్పంచ్ దాసరి గోవిందరాజు, జడ్పిటీసీ సంఘం మాజీ అధ్యక్షుడు మీనాక్షి నాయుడు, తహసీల్దార్ రియాజ్ అహ్మద్, ఎంపీడీవో అల్లాబకాష్, ఎంఈవో సావిత్రమ్మ, ఈవోఆర్డీ బాలన్న, గ్రామ కార్యకర్శులు సుశీల, సురేంద్ర, వీఆర్‌వో గోవింద్ పాల్గొన్నారు.
హాలహర్వి: తహసీల్దార్ లక్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆలూరు: పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్, డిప్యూటీ కలెక్టర్ అజయ్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరయ్యస్వామి, ఈవో ప్రభాకర్‌రావు, ఆర్‌ఐ బసవన్నగౌడ్, ప్రిన్సిపాళ్లు డా.జ్ఞానేశ్వర్, రమాదేవి పాల్గొన్నారు. అలాగే మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో యోగాసనాలు చేశారు.
హొళగుంద: తహసీల్దార్ నిజాముద్దీన్, ఎంపీడీవో విజయ లలితా, ఎమ్‌ఈవో జగన్నాఽథం, పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో యోగా చేశారు. టీడీపీ నాయకులు చిన్నహ్యాట శేషగరి, బీజే పొంపాపతి, ఎర్రిస్వామి పాల్గొన్నారు.
Updated Date - Jun 22 , 2025 | 12:07 AM