టిడ్కో గృహాలను స్వాధీనం చేయాలి
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:56 AM
టిడ్కో గృహాలను తమకు స్వాధీనం చేయాలని లబ్ధిదారులు కోరారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీ మధుసూదన్‌కు వినతిపత్రాలు ఇచ్చారు.
ఆదోని టౌన్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): టిడ్కో గృహాలను తమకు స్వాధీనం చేయాలని లబ్ధిదారులు కోరారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, ఎమ్మెల్సీ మధుసూదన్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. 11 ఏళ్ల క్రితం రూ.లక్ష చొప్పున మున్సిపల్ అధికారులకు చెల్లించామని ఇంతవరకు స్వాధీనం చేయలేదన్నారు. రుణాల కంతులు చెల్లించాలని బ్యాంకు అధికారులు తమను వేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే గృహాలు స్వాధీనం చేయాలని, అలా కాని పక్షంలో తాము చెల్లించిన రూ. లక్ష వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు గణేష్, కమల నాభ శర్మ, కాప్సే పద్మావతి, గైక్వాడ్ అనురాధ, రూపవతి, ఉషారాజ్, వెంకోబరావు పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 12:56 AM