ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి

ABN, Publish Date - Jul 11 , 2025 | 01:00 AM

గురుపౌర్ణమి వేడుక లను గురువారం జిల్లాలోని హైందవ కుటుంబాల వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

సాయిబాబాకు పూజలు చేస్తున్న అర్చకుడు

కర్నూలు కల్చరల్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): గురుపౌర్ణమి వేడుక లను గురువారం ఉమ్మడి జిల్లాలోని హైందవ కుటుంబాల వారు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా షిరిడీ సాయిబాబా, దత్తాత్రేయ దేవాలయాలు, పుట్టపర్తి సత్య సాయిబాబా మందిరాల్లో ప్రత్యేక పూజలు, మహా మంగళహారతులు, పల్లకీ సేవ, అఖండ సాయి నామ పారాయణలు నిర్వహించారు. గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి జన్మించిన సందర్భంగా వ్యాస భగవానుడిని, అలాగే ప్రాచీన యోగాశాసా్త్రన్ని అందించిన పతంజలి మహర్షిని గురుస్థానంలో పూజిస్తూ వీహెచపీతోపాటూ పలు యోగా సంస్థల సభ్యులు తమ తమ గురువులను ఘనంగా సత్కరించారు.

ఫ నగరంలో సాయినాథుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు.

నగరంలో గురుపౌర్ణమి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. వేకువ జాము నుంచే సాయిబాబా దేవాలయాల వద్ద భక్తుల సందడి బాగా కనిపించింది. వందలాదిగా భక్తులు క్యూలైన్లలో నిల్చొని బాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వివిధ ఆలయాల్లో ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.

పతంజలి యోగా శిక్షణా కేంద్రంలో..: నగరంలోని వెంకటరమణ కాలనీలోని పతంజలి సాయినాథ్‌ యోగా శిక్షణా కేంద్రంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువు విశిష్ట బాధ్యతలను యోగా గురువు దత్తయ్య సభ్యులకు తెలియజేశారు. కార్యక్రమానికి ముందు షిరి డీ సాయి, దత్తాత్రేయ స్వాములకు పూజలు చేశారు. అనంతరం యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య దంపతులను యోగా సభ్యులు సత్కరించారు.

Updated Date - Jul 11 , 2025 | 01:00 AM