ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కృష్ణాతీరానికి అతిథులు

ABN, Publish Date - May 10 , 2025 | 12:26 AM

పక్షులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలాకష్టం. పక్షులు అంటేనే ప్రకృతి. అంతటి ప్రకృతి అందమైన పక్షులు నల్లమల ప్రాంతాలకు వలస వస్తున్నాయి.

సంగమేశ్వర క్షేత్రంలోని కృష్ణాతీరంలో సందడి చేస్తున్న వలస పక్షులు

నేడు వలస పక్షుల దినోత్సవం

పక్షులు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలాకష్టం. పక్షులు అంటేనే ప్రకృతి. అంతటి ప్రకృతి అందమైన పక్షులు నల్లమల ప్రాంతాలకు వలస వస్తున్నాయి. ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని కృష్ణానదీ తీరంతో పాటు రోళ్లపాడు అభయారణ్యం, నల్లమల అటవీ ప్రాంతాల్లోకి ప్రతిఏటా ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు విదేశీ పక్షులతో పాటు దేశంలోని వివిధ విభిన్న ప్రాంతాల నుంచి ప్రతిఏటా వలస పక్షులు సందడి చేస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కృష్ణా నదీ తీరానికి చేరుకుంటున్నాయి. ఆహార సేకరణలో అతిథులుగా వచ్చి ఇక్కడే సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్తాయి. కృష్ణానదీ తీరాన వలస పక్షులు ఇలా సందడి చేస్తూ కనిపించాయి. ఇదిలా ఉండగా మే నెలలో రెండో శనివారం ప్రపంచ వలస పక్షుల దినోత్సవంగా 2006లోనే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

- ఆత్మకూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - May 10 , 2025 | 12:26 AM