వైభవంగా తెప్పోత్సవం
ABN, Publish Date - Mar 19 , 2025 | 12:51 AM
నమో నారసింహా.. అహోబిలేశా అని భక్తులు పారవశ్యంతో శ్రీవారిని స్తుతిస్తుండగా శ్రీదేవి, భూదేవి సమేతుడిగా కొలువైన ప్రహ్లాద వరదస్వామి కోనేరులో తెప్పపై విహరించారు.
ఉభయ దేవేరులతో విహరించిన శ్రీవారు
దిగువలో ముగిసిన ప్రహ్లాద వరదుని ఉత్సవాలు
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 18(ఆంధ్రజ్యోతి) : నమో నారసింహా.. అహోబిలేశా అని భక్తులు పారవశ్యంతో శ్రీవారిని స్తుతిస్తుండగా శ్రీదేవి, భూదేవి సమేతుడిగా కొలువైన ప్రహ్లాద వరదస్వామి కోనేరులో తెప్పపై విహరించారు. దిగువ అహోబిలంలో ఆదిదేవునికి మూడు రోజులుగా జరుగుతున్న తెప్పోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిసాయి. తెప్పోత్సవంలో భాగంగా అహోబిలానికి చెందిన శ్రీ ప్రహ్లాద వరద కైంకర్య సభ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ స్వామివారికి ఉదయం పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా తిరుమంజనం, అభిషేకం, అర్చన, మంగళ హారతి నిర్వహించారు. ఉభయదేవేరులతో పల్లకిలో కొలువైన ప్రహ్లాదవరదునికి తెప్పోత్సవం నిర్వహించారు.
Updated Date - Mar 19 , 2025 | 12:51 AM