మంచిని ప్రజలకు వివరించాలి
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:30 AM
ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
టీడీపీ శ్రేణులకు మంత్రి భరత్ నిర్దేశం
కర్నూలు అర్బన్, జూలైౖ 1 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగరంలో ఆయన నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుపరిపా లనలో తొలిఅడుగు కార్యక్రమంపై దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏర్ప డినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామ న్నారు. ప్రజలకు మంచి చేయడం ఒక భాగమైతే చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం మరో భాగమన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ వార్డుల్లో ఇం టింటికీ తిరిగి ప్రచారం చేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక పింఛన్ పెంపు, తల్లికి వందనం పథకం అమలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్లు, పరిశ్రమలు, ఉపాధి తదితర సంక్షేమ పథ కాలను అమలు చేశామన్నారు. రాబోయే రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మాదిరి ఏపీ కూడా అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. ఈ విషయాలన్నీ ఇంటింటికీ వెళి ్లప్రజలకు వివరిం చాలన్నారు. కార్యక్రమంలో నగర అఽధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొ రేషన్ డైరెక్టర్లు సంజీవలక్ష్మి, ముంతాజ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jul 02 , 2025 | 12:30 AM