ముగిసిన స్వర్ణోత్సవాలు
ABN, Publish Date - May 30 , 2025 | 11:22 PM
నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయంలో శుక్రవారం ఆలయ స్వర్ణోత్సవం వైభవంగా ముగిసింది.
1,236 కలశాలతో ఘటాభిషేకం
నంద్యాల కల్చరల్, మే 30(ఆంధ్రజ్యోతి): నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయంలో శుక్రవారం ఆలయ స్వర్ణోత్సవం వైభవంగా ముగిసింది. ఆలయప్రాంగణంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, ఉప ఆలయాలు, పరివార దేవతలకు 14 శిఖర కలశాలకు పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు విద్యాశంకర భారతి మహాస్వామి స్వయంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం రాజగోపురం శిఖర కళశాలకు స్వామివారు అభిషేకం చేశారు. హోమాలు నిర్వహించి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కార్తికేయ శర్మ, భగవత్‌సేవా సమాజ్ కమిటీ అధ్యక్షుడు సముద్రాల సూరయ్య, కమిటీ సభ్యులు దేవరశెట్టి శ్రీనివాస్, పార్ధసారథిక్రిష్ణ, మధు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:22 PM