లక్ష్యాలను సాధించాలి
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:46 PM
స్వర్ణాంధ్ర -2047 విజన్ అమల్లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేఽశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర -2047 విజన్ అమల్లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేఽశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో స్వర్ణాంధ్ర - 2047 విజన్ ప్లాన్, జీరో పావర్టీ, పీ4 మార్గదర్శి - బంగారు కుటుంబంపై మోడల్ సర్వేపై కలెక్టర్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు, ఇండస్ట్రీ, పంచాయతీరాజ్‌శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర - 2047 విజన్‌లో భాగంగా జిల్లా అభివృద్ధికి అన్ని రంగాల్లో కృషి చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ నిర్దేశించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీవో వేణుగోపాల్, ఆర్టీవోలు విశ్వనాఽథ్, నరసింహులు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 11:46 PM