నివేదికలు ఇవ్వండి: కలెక్టర్
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:54 PM
నివేదికలు ఇవ్వండి: కలెక్టర్
నంద్యాల నూనెపల్లె, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు కలిగే నష్టాలను నివారించడానికి వ్యూహాత్మక ప్రణాళికలను సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక-నివారణ ముందస్తు జాగ్రత్త చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంశానికి సంబంధించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఎప్పటికపుడు సంబంధిత అధికారులకు అందజేయాలన్నారు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో 2007, 2009లలో నంద్యాలలోని చామకాల్వకు వరదలు సంభవించి పట్టణం సాధారణ స్థితికి రావడానికి 17నుంచి 20రోజులు సమయం పట్టిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వాటి నివారణకు పకడ్బందీ చర్యలకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్వో రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 11:54 PM