ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గెట్‌ రెడీ..

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:28 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశిం చారు.

కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చాలని కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశిం చారు. 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహ ణపై గురువారం మండల స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీ వోలు, తహసీల్దార్లు తదితరులతో కలెక్టర్‌ టెలి కాన్ఫరె న్స్‌ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 21న అన్ని వేదికల్లో ఖచ్చితంగా ఉదయం 7 గంటలకు యోగా కార్యక్రమం ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6:15 గంటలకు సిద్ధంగా ఉండాలన్నారు. యోగా చేసేందుకు మ్యాట్స్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడైనా ఏర్పాట్లు సరిగ్గా చేయకపోతే మండల స్పెషల్‌ ఆఫీసర్‌, ఎంపీడీవో, తహసీల్దార్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రతి మండలానికి ట్రైనర్లను రిజర్వులో ఉంచడం జరిగిందని, వారికి ఒక క్లస్టర్‌ పాయింటులో ఉంచి ఎక్కడైనా ట్రైనర్లు లేకపోతే వెంటనే వారిని పిలుచుకునేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 19 , 2025 | 11:28 PM