ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్యాస్‌ ధర తగ్గించాలి

ABN, Publish Date - Apr 09 , 2025 | 12:55 AM

పెంచిన గ్యాస్‌ ధర ను తగ్గించాలని కోరుతూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నగరం లోని పలు ప్రాంతాలలో ధర్నా నిర్వహించారు.

పూలబజార్‌లో ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): పెంచిన గ్యాస్‌ ధర ను తగ్గించాలని కోరుతూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నగరం లోని పలు ప్రాంతాలలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పేరుతో లీటర్‌పై రెండు రూపా యలు పెంచడాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నా లో ఆయన మాట్లాడుతూ పెరిగిన ఎక్సైజ్‌ సుంకంతో ప్రజలపై భారం పడుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టాక 15 సార్లు గ్యాస్‌ ధరలు పెంచిందని ఆరోపించారు. కార్యక్ర మంలో నాయకులు నాగరాజు, కృష్ణ పాల్గొన్నారు.

ఫ పెంచిన గ్యాస్‌ ధరను తగ్గించాలని కోరుతూ పూలబజార్‌లో సీపీఎం పాతబస్తీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర నాయకురాలు జయమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతూ పేద ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని చెప్పి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలకడం సబబుకాదన్నారు. కార్యక్రమంలో అబ్దుల్‌దేశాయ్‌, చాంద్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:55 AM