ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భావిభారతం.. కష్టాలతో సహవాసం

ABN, Publish Date - Jul 26 , 2025 | 11:09 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా విద్యార్థులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు.

పెద్దపాడు బీసీ బాలుర వసతి గృహాంలో కుక్కల మధ్య భోజనం చేస్తున్న విద్యార్థులు

కనీస సౌకర్యాలు కరువాయె..

శిథిలావస్థలో భవనాలు

వర్షం పడితే జాగరణే

పందులు, కుక్కల స్వైర విహారం

ఆరుబయటే స్నానాలు

ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా విద్యార్థులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు. భావిభారతం కష్టాలతో సహవాసం చేయాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సంక్షేమ వసతిగృహాలు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సంక్షేమ వసతిగృహం అంటే సమస్యలకు కేరాఫ్‌ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఒకటి అర అయితే సర్దుబాటు చేసుకుంటున్నారు చిన్నారులు. కానీ అన్నీ ఇబ్బందులే ఎదురైతే వారు ఎలా తట్టుకోగలరు. వసతిగృహాల్లో చదివి ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలనుకున్న పిల్లలకు సమస్యలు భయ పెట్టిస్తున్నాయి. పగలు, రాత్రులు అనే తేడా లేకుండా నిత్యం కష్టాల కడలిలో చదువులు సాగిస్తున్నారు.

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): నేటి బాలలే రేపటి భావి భారతపౌరులు. ఇలాంటి భావిభారతం.. కష్టాల కడలిలో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో సంక్షేమ వసతిగృహాలు సమస్యల సుడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కర్నూలు నగరపాలక పరిధిలోని పెద్దపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహం ఉంది. ఇక్కడ 145 మంది పేద విద్యార్థులు పదవ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నారు. 40 సంవత్సరాల క్రితం హాస్టల్‌కు ఆరు గదులతో స్వంత భవనం నిర్మించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా షెడ్డును నిర్మించారు. భవనం శిథిలావస్థకు చేరింది. ఇందులో నాలుగు గదులను మాత్రమే విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు, మరో రెండు గదులను, స్టోర్‌ రూం, ఆఫీస్‌ రూంగా వినియోగిస్తున్నారు. వర్షం వస్తే నీరు కిందకు చేరి చిత్తడి చిత్తడిగా ఉంటుంది. వర్షం పడిన రోజు విద్యార్థులకు జాగరణ చేయాల్సిందే. నాలుగేళ్ల క్రితం టాయిలెట్స్‌, బాత్‌రూమ్స్‌ను నిర్మించారు. విద్యార్థులు వినియోగించుకోకుండానే పాడైపోయాయి. రెండు సంవత్సరాల కిందట ఆ ప్రక్కనే టాయిలెట్‌ బ్లాక్‌ను నిర్మిం చారు. దీనికి బోరు, మోటారు అమర్చకపోవడంతో నిరూ పయోగంగా పడి ఉంది. కాలకృత్యాలను తీర్చుకునేందుకు ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రివేళల్లో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. భవనం ద్వారం పక్కనే మూత్ర విసర్జన చేస్తుండడంతో భరించలేని దుర్వాసన వ్యాపిస్తోంది. వర్షాకాలం అయితే బురద మయంగా మారి పందులు, కుక్కలు సంచరిస్తున్నాయి. ఇనుప మంచాలు విరిగిపోవడంతో పడుకోవడానికి అనువుగా లేవు. ఆరు బయటనే స్నానాలు చేస్తున్నారు. ఫ్యాన్లు అరకొరగా ఉన్నాయి. రాత్రుళ్లు దోమల బెడదతో అనారోగ్యాల పాలవుతున్నారు. ఇది ఒక్క పెద్దపాడు బీసీ బాలుర వసతి గృహాంలోనే కాదు. జిల్లాలోని చాలా వసతిగృహాల్లో ఇదే పరిస్థితి. విద్యార్థులు కనీస వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జిల్లాలో 84 వసతిగృహాలు..

కర్నూలు జిల్లాల్లో బీసీ, ఎస్సీ. ఎస్టీ వసతి గృహాలు 84ఉన్నాయి. ఈవసతిగృహాల్లో 14,500మంది బాలబాలికలు విద్యను అభ్య సిస్తున్నారు. 29 ప్రీమెట్రిక్‌ ఎస్సీ హాస్టళ్లు 5124లో, 8 కాలేజ్‌ వసతిగృహల్లో 1157 మంది ఉన్నారు. 31ప్రీమెట్రిక్‌ బీసీ హాస్టళ్లు లో 5782లో 16 కాలేజ్‌ వసతి గృహాల్లో 2300 మంది, నాలుగు గిరిజన వసతి హాస్టళ్లలో 921 మంది విద్యార్థులు ఉన్నారు.. కశాళాల వసతిగృహాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అధిక శాతం ప్రీమెట్రిక్‌ సొంత భవనాలైన మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరాయి,

వేధిస్తున్న ఉద్యోగుల కొరత

వసతిగృహాల్లో వాచ్‌మెన్‌, కుక్‌, కమాటిల కొరత వేధి స్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగులు లేరు. 2016 నుంచి నియా మకాలు లేవు. ఉన్న వారు కూడా పదవీరమణ అవుతు న్నారు. ప్రతి 100 మందికి ముగ్గురు ఉండాలి. వంద సంఖ్య దాటితే, ప్రతి 50మందికి అదనంగా ఒకరిని నియమించాలన్నది నిబంధనలు.

వార్డెన్లు స్థానికంగా నివాసం ఉండటం లేదనే..

వసతి గృహాల పై హాస్టల్‌ వార్డెన్ల పర్యవేక్షణ కొరవడింది. వారు స్థానికంగా నివాసం ఉండడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉంటూ వచ్చివెళ్తూ విధులను నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వార్డెన్స్‌ అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్టళ్లను తనిఖీలు చేయాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారనే అరోపణలు ఉన్నాయి. వసతిగృహాలను చక్కదిద్దాల్సిన అధికారులు వార్డెన్ల నుంచి విద్యార్థుల సంఖ్య ప్రకారం ఒక్కొక్క విద్యార్థికి రూ.30 నుంచి రూ.40లు ప్రతి నెలావసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వార్డెన్లు పిల్లల కడుపులు కొట్టి కమీషన్లు ఇస్తున్నారనే ఆరోసణలు ఉన్నాయి .

రూ.85 లక్షలతో మరమ్మతు పనులు

జిల్లాలోని 29 ప్రీమెట్రిక్‌ వసతిగృహాల్లో రూ.85లక్షలతో మరమ్మతుల పనులు కొనసాగు తున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందు కు సంబధిత ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2025 మార్చి నెల నుంచి డైట్‌ చార్జీస్‌ 2024 సెస్టెంబర్‌ నెల నుంచి కాస్మోటిక్‌ చార్జిలు పెండింగ్‌లో ఉన్నాయి. స్టాఫ్‌ కొరత ఉంది, ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ వచ్చిన తర్వాత టెక్నికల్‌ సమస్యలు ఉన్నాయి, లోపాలను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వార్డెన్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న విషయంలో వాస్తవం లేదు.

ప్రసూన, డీబీసీడబ్ల్యూవో, కర్నూలు

Updated Date - Jul 26 , 2025 | 11:09 PM