వేదవతికి నిధులు కేటాయించాలి
ABN, Publish Date - Apr 24 , 2025 | 01:23 AM
వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, లేదంటే ఆలూరు ప్రాంతం ఏడారిలా మారిపోయే ప్రమాదం ఉందని వేదవతి ప్రాజెక్టు కార్యాలయం వద్ద వేదవతి ప్రాజెక్టు సాధన కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు
ప్రాజెక్టు సాధన సమితి కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి
ఆలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల మహా ధర్నా
ఆలూరు, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని, లేదంటే ఆలూరు ప్రాంతం ఏడారిలా మారిపోయే ప్రమాదం ఉందని వేదవతి ప్రాజెక్టు కార్యాలయం వద్ద వేదవతి ప్రాజెక్టు సాధన కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయాలని పాలకులు, ప్రభుత్వాలు అనుకోవడం లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వంపై వత్తిడి తీసుకురా వడానికి రైతులు కలిసిరావాలన్నారు. 8 టీఎంసీలను సద్వినియోగం చేసుకునేం దులకు వీలుగా అలుగు నిర్మాణంపై దృష్టి సారించి సూమారు 80వేల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టుకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ గోవింద్ సింగ్‌కు వినతిపత్రం అందించారు. రాయసీమ జల సాధన కమిటీ నాయకుడు దశరథరామిరెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకులు సవారప్ప, పీడీఎస్‌యూ నాయకులు అఖండ, మునిస్వామిలు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 01:23 AM