బలవంతపు భూసేకరణ ఆపాలి
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:20 PM
అభివృద్ధి పేరుతో రైతన్నల జీవనాధారమైన భూములను బలవంతంగా సేకరించడం ఆపాలని రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి
రైతు వ్యతిరేక భూసేకరణ విధానాలపై రాష్ట్ర సదస్సు
నంద్యాల రూరల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పేరుతో రైతన్నల జీవనాధారమైన భూములను బలవంతంగా సేకరించడం ఆపాలని రైతుసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నేషనల్ పీజీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక భూసేకరణ విధానాలపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్, గ్రీన్ ఎనర్జీల పేరుతో బలవంతంగా రైతుల వద్ద నుంచి భూములను సేకరించి ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం రైతులకు తీవ్రద్రోహం చేసినట్లేనని ఆరోపిం చారు. చట్టబద్ధమైన రీతిలో భూసేకరణ చేయకుండా అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు చేయడం సరికాదన్నారు. రైతు కుటుంబాల భావి జీవితాలకు తీరని విఘాతం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ గో విందరాజులు మాట్లాడుతూ రైతులు నెత్తిన కత్తిపెట్టి రైతుల నుంచి భూము లను లాక్కొని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కౌలు రైతుసంఘ రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల్ల సూర్యారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, పలు జిల్లాలకు చెందిన రైతు సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 11:20 PM