గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఎవరి కోసం?
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:17 AM
రాష్ట్రంలో రూ.81 వేల కోట్లతో ప్రకటించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఎవరి కోసం నిర్మిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు.
కర్నూలు న్యూసిటీ, జూన్ 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రూ.81 వేల కోట్లతో ప్రకటించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఎవరి కోసం నిర్మిస్తున్నారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం కేకే భవన్‌లో జిల్లా కార్యదర్శి జి. రామక్రిష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాఽంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు. రాయలసీమ, ఉత్తరాఽంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.13.844 కోట్లు అవుతుందన్నారు. వీటి నిర్మాణం పూర్తి అయితే కొత్తగా సాగునీరు అందించే ఆయకట్లు 13,80,529 ఎకరాలు అన్నారు. వాటి నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించకుండా రూ.81 వేల కోట్లతో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి వచ్చే కమీషన్ల కోసం రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చవద్దని అన్నారు.
Updated Date - Jun 08 , 2025 | 12:17 AM