ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

ABN, Publish Date - Jun 14 , 2025 | 01:31 AM

జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం నదీజలాల నడుమ ద్వీపకల్పంగా దర్శనమిస్తోంది.

సంగమేశ్వర ఆలయానికి నలువైపులా చేరుతున్న కృష్ణా జలాలు

కనువిందు చేస్తున్న ప్రకృతి అందాలు

ఉపాధి పొందుతున్న మత్స్యకారులు

నేడు గర్భాలయంలోకి నదీ జలాలు ప్రవేశించే అవకాశం

ఆత్మకూరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సప్తనదుల సంగమేశ్వర క్షేత్రం నదీజలాల నడుమ ద్వీపకల్పంగా దర్శనమిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీవర్షాలతో కొన్నిరోజులుగా శ్రీశైలానికి వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రదేశంలో వెలసిన సంగమేశ్వర క్షేత్రాన్ని నదీజలాలు రోజురోజుకూ ముంచెత్తుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 6గంటల సమయానికి శ్రీశైల జలాశయానికి జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 15241 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 21,895 క్యూసెక్కుల చొప్పున మొత్తం 37139 క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది. దీంతో జలాశయంలో 57.1874 టీఎంసీల నీటి నిల్వలతో పాటు 836.70అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ లెక్కన సంగమేశ్వరాలయం పశ్చిమ ద్వారంలోని చివరి మెట్టువరకు నదీజలాలు వచ్చి చేరాయి. అదేక్రమంలో ఆలయానికి చేరుకునే రహదారి మినహాయించి అన్ని వైపుల వరద జలాలు చుట్టుమట్టడంతో ప్రస్తుతం క్షేత్రం ద్వీపకల్పంగా కనిపిస్తోంది. దిగువ పుష్కర ఘాట్‌ వద్దకు నదీ జలాలు సమృద్ధిగా చేరుకున్నాయి. కొన్ని రోజులుగా శ్రీశైల జలాశయానికి స్వల్పంగా వరద కొనసాగు తున్నప్పటికీ అదేస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తితో పాటు పలు సాగునీటి పథకా లకు నీటి విడుదల కొనసాగుతుండటంతో నీటిమట్టం నిలకడగా ఉంటుంది. శ్రీశైలానికి వరద ప్రవాహం కొంత మేర పెరిగింది. ఇదే ప్రవాహం కొనసాగితే శనివారం గర్భాలయంలోకి నదీజలాలు ప్రవే శించే అవకాశం ఉంది.

శ్రీశైల జలాశయం నీటిమట్టం ఆధారంగానే..

శ్రీశైల జలాశయం నీటిమట్టం ఆధారంగానే సంగమేశ్వర క్షేత్ర జలాధివాసం జరగడం పరిపాటిగా వస్తోంది. శ్రీశైల జలాశయంలో 839 అడుగుల నీటిమట్టం నమోదైతే సంగమేశ్వరంలోని గర్భాల యంలోకి నదీజలాలు ప్రవేశిస్తాయి. 854 అడుగులకు చేరుకు న్నట ్లయితే ముఖమం టపం, 865అడుగులకు ఆలయం శిఖరం పూర్తిగా నీటమునగనుంది. కాగా శ్రీశైలం జలాశయం వెనకతట్టు జలాల్లో 1981లో జలాధివాసమైన సంగమేశ్వరుడు సుమారు 22ఏళ్ల తర్వాత 2003లో తొలిసారిగా నదీజలాల నుంచి బయల్పడ్డాడు. సంగమేశ్వ రుడు వేపదారు శివలింగం ప్రతిఏటా ఎనిమిది నెలల పాటు సప్త నదీజలాల్లో జలాధివాసమై నాలుగు నెలలు భక్తులచే పూజలందు కుంటున్నాడు. ఈ ఏడాది మార్చి నెలలో నదీజలాల నుంచి ఆల యం పూర్తిగా బయల్పడి తిరిగి నాలుగు నెలలకు జలాధివాసానికి సిద్ధమవ్వడం గమనార్హం.

ఆధ్యాత్మికతతో పాటు..

సప్తనదుల సంగమేశ్వరం క్షేత్రం అధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తోంది. శ్రీశైల జలాశయానికి వరద కొన సాగుతుండటంతో చెంతనే సప్తనదీ జలాల పరవళ్లతో పాటు చుట్టు నల్లమల పచ్చటి అందాలు అక్కడికి వచ్చిన వారిని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మత్స్యకారుల జీవన విధానం ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ప్రస్తుతం సంగమేశ్వర క్షేత్రంలో వరద ప్రవాహం ఉండటంతో ఈ సమయంలో చేపల వేట అధికంగా ఉంటుందని మత్స్యకా రులు కుటుంబసమేతంగా చేపల వేటను కొనసాగిస్తున్నారు. ఉదయాన్నే ఓ విడత పుట్టీలపై నదీజలాల్లో ప్రయాణించి వలలు వేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు వలలను తిరిగి సేక రించి అందులో చిక్కిన చేపలను పడుతు న్నారు. ఈ రకంగా సేకరించిన చేపలలను విక్రయిం చుకుని తమ జీవనాన్ని సాగిస్తున్నారు. కృష్ణాతీరం నుంచి ఇతర ప్రాంతాలకు చేపల ను ఎగుమతి చేసే వాహనాల డ్రైవర్ల ద్వారా నిత్యావసర సరు కులను తెప్పించుకుని బయటి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధం లేకుండా కృష్ణాతీ రంలోనే గడిపేస్తున్నారు. కనీసం రాత్రివేళల్లో విద్యుత్‌ సదుపాయం లేకున్నప్పటికీ కృష్ణమ్మ సవ్వడులు, ఆకాశంలోని వెన్నేలే వారికి అండదండలుగా నిలుస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలో నీటినిల్వలు తగ్గే వరకు ప్రతిరోజు వారి జీవనపోరాటం బిజీబిజీగా గడుస్తోంది.

Updated Date - Jun 14 , 2025 | 01:31 AM