పుష్కర ఘాట్లను ముంచెత్తిన వరద జలాలు
ABN, Publish Date - Jul 06 , 2025 | 12:08 AM
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సప్తనదుల సంగమేశ్వరంలోని ఎగువ పుష్కరఘాట్లను వరద జలాలు ముంచెత్తుతున్నాయి.
శ్రీశైలానికి కొనసాగుతున్న 1.88 లక్షల క్యూసెక్కుల వరద
కొత్తపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సప్తనదుల సంగమేశ్వరంలోని ఎగువ పుష్కరఘాట్లను వరద జలాలు ముంచెత్తుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి 1.88లక్షల క్యూసెక్కులు వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885అడుగులు కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 877.40 అడుగులుగా నమోదైంది. అలాగే రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వలు 215టీఎంసీలు కాగా 175 టీఎంసీలుగా నమోదైంది. ఇదిలా ఉంటే గత వారంలోనే సంగమేశ్వరాలయం పూర్తిగా కృష్ణమ్మ నది గర్భంలో నిక్షిప్తమైన విషయం విదితమే ఈ నేపథ్యంలో ఎగువ పుష్కర ఘాట్లపైన ఉన్న ఉమామహేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శివుడ్ని దర్శిం చుకుని భక్తులు పూజలు చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ వరద జలాలు అధికంగా చేరుతుండటంతో సముద్ర తీరం తలపిస్తుంది. దీంతో పర్యాటకులు తిలకించేందుకు అధికంగా తరలివస్తున్నారు.
Updated Date - Jul 06 , 2025 | 12:08 AM