యూనియన్ బ్యాంక్‌కు వడ్డింపు
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:05 AM
ఖాతాదారుల నుంచి బీమా ప్రీమియం వసూళ్లు చేసి ఆ తర్వాత ఆయన మృతి చెందిన తర్వాత బీమా మొత్తం చెల్లించకుండా సేవాలోపం చేసిన కోవెలకుం ట్లలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ తగిన రీతిలో వడ్డిం చింది.
బీమా పరిహారం, ఖర్చులు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశం
కర్నూలు లీగల్, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): ఖాతాదారుల నుంచి బీమా ప్రీమియం వసూళ్లు చేసి ఆ తర్వాత ఆయన మృతి చెందిన తర్వాత బీమా మొత్తం చెల్లించకుండా సేవాలోపం చేసిన కోవెలకుం ట్లలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ తగిన రీతిలో వడ్డిం చింది. కోవెలకుంట్లకు చెందిన పువ్వాడి రామసుబ్బ య్య కోవెలకుంట్లలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఒక ఖాతాను తెరిచారు. బ్యాంకు అధికారులు ప్రతి ఏడాది ఖాతాదారుడి నుంచి అభయ గోల్డ్ బీమా పథకానికి ప్రీమియం వసూలు చేసేవారు. ఆ తర్వాత రామసుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఆయన కుమారుడు నామీని అయిన పువ్వాడి సురేష్ అబయగోల్డ్ బీమా మొత్తం రూ.1.50 లక్షల కోసం బ్యాం కుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. మృతుడి వయస్సు 70ఏళ్లు కావడంతో పాలసీ అతనికి వర్తించదని బ్యాంకు అధికారులు ఫిర్యాది దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆయన బ్యాంకుతో పాటు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీపై జిల్లా వినియోగదారుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో పాలసీ నిబంధనల మేరకు ఖాతాదారుడు 75 సంవత్సరాల వరకు ఈ బీమా వర్తిస్తుందనే నిబంధ నలను వినియోగదారుల కమిషన్ గుర్తించింది. దీంతో ఫిర్యాది చేసుకున్న క్లెయిమ్‌ను బ్యాంకు అఽధికారులు తిరస్క రించడం సేవాలోపం అవుతుందని నిర్ధారించింది. ఈ మేరకు బ్యాంకు అధికారులు ఫిర్యాదికి బీమా రూ.1.50 లక్షలను 9 శాతం వడ్డీతో పాటు మానసిక ఆవేద నకు గురి చేసినందుకు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.15 వేలు చెల్లించాలని ఆదేశిస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్ కరణం కిషోర్ కుమార్, మహిళా సభ్యురాలు నజీమా కౌసర్లు గురువారం ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Apr 18 , 2025 | 12:05 AM