ఎట్టకేలకు సీట్ల మార్పు
ABN, Publish Date - Jul 27 , 2025 | 11:42 PM
కర్నూలు వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో కొత్తగా వచ్చిన సీనియర్ అసిస్టెంట్లకు సీట్లు కేటాయించారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదులు వెళ్లడంతో చర్యలు
ఇప్పటికీ ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్ అవుట్ చేయని వైద్యశాఖ
కర్నూలు హాస్పిటల్, జూలై 27(ఆంధ్రజ్యోతి): కర్నూలు వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో కొత్తగా వచ్చిన సీనియర్ అసిస్టెంట్లకు సీట్లు కేటాయించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో డీఎంహెచ్‌వో ఆఫీసులో పని చేస్తున్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లతో పాటు కిందిస్థాయి సిబ్బంది బదిలీ అయ్యారు. ఉద్యోగులు బదిలీ అయిన పీహెచ్‌సీలకు వెళ్లకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇటీవల డీఎంహెచ్‌వో కార్యాలయానికి బదిలీపై వచ్చిన ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు కూడా ఇంత వరకు సీట్లు కేటాయించలేదని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై డీఎంహెచ్‌వో శనివారం కొత్తగా వచ్చిన ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సీట్లు కేటాయించారు. డాక్టర్, ఆల్ గెజిటెడ్ సీటు అయిన ఈ1 సెక్షన్ ఫణిభూషణ్, స్టాఫ్ నర్సు, ఎంపీహెచ్‌ఈవో, ఎంపీహెచ్‌ఎస్, పీహెచ్‌ఎన్ హెల్త్ ఎడ్యుకేటర్, హెడ్‌నర్సు, ఎంఎల్‌హెచ్‌పీ, ఎన్‌హెచ్‌ఎం సీట్లు అయిన ఈ2 సెక్షన్‌ను బి.విశ్వనాథ్‌కు, ఈ3 సెక్షన్ వై.భూపాల్‌కు సీనియర్ అసిస్టెంట్, ఎల్‌డీ కంప్యూటర్, బిల్డింగ్, ఏజీ ఆడిట్‌ను కేటాయించారు. హాస్పిట ల్ రిజిస్ర్టేషన్ అయిన ఈ3ని డెమో సెక్షన్‌కు కేటాయించారు. అయితే అందుకు డెమో సెక్షన్ ఈ సీటును స్వీకరించేందుకు విముఖుత చూపినట్లు తెలిసింది. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బదిలీ అయిన సీనియర్ అసిస్టెంట్లుతో పాటు కొందరి నాలుగో తరగతి సిబ్బందికి ఎఫ్‌ఆర్‌ఎస్ ఇంత వరకు అవుట్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. బదిలీ అయిన ఉద్యోగులకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఎందుకు అవుటింగ్ కొట్టలేదన్న చర్చ ఉద్యోగుల్లో తీవ్రంగా సాగుతోంది.
Updated Date - Jul 27 , 2025 | 11:42 PM