ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యల పరిష్కారం కోసమే పోరాటం

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:00 AM

సమస్యల పరిష్కారం కోసమే పోరాటాలు కొనసాగిస్తున్నట్లు ఏపీ మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు చందన అన్నారు.

నిరసన తెలుపుతున్న ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్‌వోలు

ఎంఎల్‌హెచ్‌పీలను క్రమబద్ధీకరించాలి

కమ్యూనిటీ హెల్త్‌ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు చందన

శ్రీకృష్ణదేవరాయ కూడలిలో నిరసన

కర్నూలు హాస్పిటల్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోసమే పోరాటాలు కొనసాగిస్తున్నట్లు ఏపీ మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు చందన అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లో పనిచేస్తున్న మిడ్‌లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు సమస్యలను పరిష్క రించాలని కోరుతూ నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం శ్రీకృష్ణదేవరాయల కూడలిలో ఎంఎల్‌హెచ్‌పీ, సీమెచ్‌ఓలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీఎంసీఏ దశలవారీగా నిరసనలు చేపట్టిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఎన్‌హెచ్‌ఎం కింద రెండేళ్లుగా పనిచేస్తున్నా జీతాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. ఆరేళ్లు దాటిన ఎంఎల్‌హెచ్‌పీలను రెగ్యులర్‌ చేయాలని, గతేడాది జీవో నెంబరు 64 కింద ఎన్‌హెచ్‌ఎంలో 189 క్యాడర్లకు 23 శాతం పీఆర్‌సీ అమలుచేశారని, కానీ సీహెచ్‌ఓలకు మాత్రమే పీఆర్‌సీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో 800 మందికిపైగా ఎంఎల్‌హెచ్‌పీ, సీహెచ్‌ఓలు ఉన్నారన్నారు. ఎన్‌హెచ్‌ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని, ప్రతియేడు ఐదు శాతం ఇంక్రిమెంట్‌ అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్య క్షుడు నాగరాజు, కోశాధికారి కార్తీక్‌, జిల్లా నలుమూలల నుంచి సీహెచ్‌ఓలు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2025 | 12:00 AM