పాఠశాలల్లో పండుగ
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:17 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగలా సాగింది. గురువారం వెల్దుర్తిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పీటీఎంకు కలెక్టర్, డీఈవో హాజరయ్యారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు
ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజవర్గాల్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు.. విజేతలకు బహుమతులు
వెల్దుర్తి, జూలై 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగలా సాగింది. గురువారం వెల్దుర్తిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పీటీఎంకు కలెక్టర్, డీఈవో హాజరయ్యారు. కలెక్టర్ రంజిత్‌బాషా మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బంధం బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ను నిర్వహిస్తోందన్నారు. విద్యార్థుల కోసమే ప్రభుత్వం యూనిఫామ్, కిట్స్, వస తుల కల్పించిందన్నారు. నాణ్యమైన విద్యను అందిం చేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పదో తరగతి విద్యార్థులంతా వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎం చంద్రావతిని ఆదేశించారు. బీసీ హాస్టల్ సరిపోవడం లేదని మరో వసతి గృహాన్ని నిర్మించాలని పేరెంట్స్ కమిటీ చైర్మన్‌లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, చర్యలు తీసుకుం టామని కలెక్టర్ హామీ అనంతరం వంటగదిని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మ్యూజికల్ చైర్స్, కబడ్డీ నిర్వహించారు. డీఈవో శామ్యూల్ పాల్, తహసీల్దార్ చంద్రశేఖరవర్మ, ఎంపీడీవో సుహాసినమ్మ, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్‌గౌడు, సుబ్బరాయుడు, రమాకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ సుంకన్న, ఎంఈవో ఇందిర, గర్ల్స్‌హాస్టల్ వార్డెన్ గిరిజ పాల్గొన్నారు.
ఆదోని అగ్రికల్చర్: పట్టంలోని నెహ్రూ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన పీటీఎంకు ఎమ్మెల్యే పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మున్సిపల్ పాఠశాలలో హెచ్‌ఎం మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చైర్‌పర్సన్ లోకేశ్వరి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిది ద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. విద్యార్థుల తండ్రులకు టగ్ ఆఫ్ వార్ తల్లులకు లెమన్ స్పూన్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆర్‌ఆర్‌లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాల హెచ్‌ఎం రవి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విట్టా రమేష్, కిలిచిన్ పేట పురపాలక ఉన్నత పాఠ శాలలో పాఠశాల హెచ్‌ఎం ఉరుకుందప్ప, అండర్ పేట ఉర్దూ పాఠశాల హెచ్‌ఎం అలిమ్ సిదిఖీ, కల్లుబావి ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం గిరిబాబు పాల్గొన్నారు. ఎస్‌ఎంసీ చైర్మన్ ఉరుకుందు ఉపాధ్యాయులు సునీల్ రాజ్ కుమార్, నాగరాజు రమేష్ నాయుడు, మల్లికార్జున మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులు సుధాకర్ ప్రసాద్, ఆర్‌ఆర్ లేబర్ కాలనీ ఉపాధ్యాయులు వీర చంద్ర యాదవ్, శ్రీరాములు, టీఎన్‌ఎస్‌ఎఫ్ రామంజి పాల్గొన్నారు.
అమ్మను గుండెల్లో పెట్టుకోవాలి
ఆదోని: అమ్మ మనకు నడక, సత్ప్రవర్తన, బాధ్యత, విలువలు, నైతికత నేర్పించిందని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప సూచించారు. గురువారం పెద్దహరివాణం జడ్పీ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు.డ్రగ్స్ వాడితే భవిష్యత్ సర్వనాశనం అవుతుందన్నారు. తమ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విద్యార్థుల కోసమే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో సన్న బియ్యంతో భోజనం ఇస్తున్నారన్నారు. సర్పంచ్ రాము, ఆదినారాయణరెడ్డి, పేరెంట్స్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పత్తికొండ: విద్యార్థులు ఇష్టపడి చదివితే ఫలితాలు వస్తాయని ఎంఈవో రమేష్ విద్యార్థులకు సూచించారు. గురువారం పత్తికొండ బాలికోన్నతపాఠశాలలో మెగా పీటీఎం నిర్వఇంచారు. ఎచ్‌ఎం శ్రీదేవి ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు క్రీడలు నిర్వహించి, బహుమ తులను అందించారు. జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నయీ మున్సీసా బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు
తుగ్గలి:తల్లిదండ్రుల కృషితోనే విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర అన్నారు. గురువారం తుగ్గలి, జొన్నగిరి, రాంపల్లి, పెండేకల్ ఆర్‌ఎస్, ముక్కెల్ల తదితర గ్రామాల్లో మెగా పీటీఎం 2.0 నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు వరలక్ష్మి, విద్యాకమిటీ చైర్మన్లు మిద్దె రవికుమార్, అమీనా, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆలూరు: మోడల్ స్కూల్‌లో ఎంఈవో చిరంజీవిరెడ్డి పాల్గొన్నారు. ు. ప్రిన్సిపాల్ రాఘవరావు, వైస్ ప్రిన్సిపాల్ వీరేష్, ఎస్‌ఎంసీ చైర్మన్ విశ్వేశ్వరస్వామి పాల్గొన్నారు.
Updated Date - Jul 11 , 2025 | 12:17 AM