ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతన్నా జాగ్రత్త!

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:07 AM

ఖరీఫ్‌ మొదలవడంతో రైతులు దుక్కి దున్ని పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. పనిలో ఉండే రైతులు చుట్కుపక్కల గమనించకుండా వెళుతుండటంతో విష సర్పాల కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

పొలాల్లో విష సర్పాలు కాటేసే ప్రమాదం

చిన్న జాగ్రత్తలు తీసుకుంటే క్షేమం

ఆలూరు, జూన్‌17(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ మొదలవడంతో రైతులు దుక్కి దున్ని పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. పనిలో ఉండే రైతులు చుట్కుపక్కల గమనించకుండా వెళుతుండటంతో విష సర్పాల కాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. పొలాల్లో జూన్‌ నుంచి నవంబరు వరకు విష సర్పాల బెడద ఎక్కువగా ఉంటుంది. రైతులు అప్రమత్తంగా ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి బారిన పడకుండా చూసుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు పాటించండి

పొలం గట్ల మీద వెళ్లే సమయంలో కర్రతో శబ్ధం చేస్తూ నడవాలి. రాత్రిళ్లు పొలాలకు నీరు కట్టడానికి వెళ్లిన సమయంలో టార్చ్‌లైట్‌ తీసుకుని వెళ్లాలి. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఒకవేళ పాముకాటుకు గురయితే..

పాము కరచిన సమయంలో ఆందోళన చెందవద్దు. చాలామంది ఆందోళనతోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటారని వైద్యులు అంటున్నారు. పాము కరచిన వ్యక్తికి ఇంట్లో వారు ధైర్యం చెప్పాలి. పాముకాటు వేయగానే కొందరు గాయాన్ని మరింతగా కోస్తే రక్తంతో పాటు విషయం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు. అలా చేయకూడదు. వెంటనే సమీప ఆసుపత్రిలో సంప్రదించండి.

పాముకాటు లక్షణాలు..

పాము కటువేసిన ప్రదేశంలో రెండు కోరల గాయం స్పష్టంగా కనిపించి నొప్పి తీవ్రంగా ఉంటుంది.

నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది.

పాక్షిక పక్షవాతం కారణం గా నాలుక మందమైనట్టు, గొంతు కండరాలు బిగుసుకు న్నట్లు అనిపిస్తాయి.

ఫ కళ్లు మగతగా శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పో వచ్చు.

కట్లపాము లక్షణాలు...

కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి.

నాగుపాము లక్షణాలు

కాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది.

రక్తపింజరి లక్షణాలు....

ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది.

జెర్రిపోతు, నీరుకట్ట కాటు వేసినా విషం ఉండదు. చికిత్స చేయించుకోవాలి.

అందుబాటులో ఇంజెక్షన్లు

పాము కాటు బాధితుల కోసం ప్రభుత్వాసు పత్రిలో యాంటీ స్నేక్‌ వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించకూడదు. పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండాలి. గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. ప్రథమ చికిత్స చేసి గాయాన్ని బట్టి రెండుసార్లు ఇంజెక్షన్‌ వేసుకుంటే ప్రమాదం ఉండదు.- డా.వహీద్‌, వైద్యుడు, ప్రభుత్వ ఆసుపత్రి, ఆలూరు

Updated Date - Jun 18 , 2025 | 12:07 AM