ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు ఖుషీ

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:48 AM

అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో కన్నా ఎక్కువగా సాయం అందనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాత సుఖీభవ జాబితా విడుదల చేసిన ప్రభుత్వం

ఆదోని సబ్‌ డివిజన్‌లో 53,748 మంది రైతులకు లబ్ధి

ఆదోని అగ్రికల్చర్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతులకు ‘అన్నదాత సుఖీభవ పథకం’ లబ్ధిదారుల జాబితా విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లబ్దిదారుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ఉంచారు. ఆధార్‌ నంబర్‌ ఆధారంగా రైతులు తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవచ్చని వ్యవసాయాధి కారులు తెలిపారు.

డివిజన్‌లో 53,748 మంది అర్హులు

ఆదోని వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఆదోని, కౌతాళం, కోసిగి,పెద్ద కడుబూరు మండలాల్లో మొత్తం 53,748 మంది రైతులు ‘అన్నదాత సుఖీభవ’కు అర్హులుగా అధికారులు గుర్తించారు. వీరికి మొదటి విడతలో రూ.7వేలు ఖాతా లో ప్రభుత్వం జమ చేయనుంది. మిగతా రూ.13వేలను ఆరు నెలల్లోపే అందించనున్నారు. ఇప్పటి వరకు సొంత భూమి ఉన్న రైతులకు వెబ్‌ ల్యాండ్‌ ఆధారంగానే సాయం చేస్తుండగా, ఇప్పుడు కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం ఆమోదం తెలిపితే కౌలు రైతులకు కూడా వర్తించనుంది.

గతం కన్నా ఎక్కువగా సాయం

గంతలో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రూ. 13,500లు ఇచ్చింది. వీటిలో పీఎం కిసాన్‌ కింద కేంద్రం ప్రభుత్వం రూ. 6 వేలు అందించగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,500 ఇచ్చేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ సాయాన్ని రూ.20 వేలకు పెంచింది. కాగా గత ప్రభుత్వ హయాంలో కొత్త భూములు కొనుగోలు చేసుకున్న వారి వివరాలు నమోదు అయి ఉండేవి కాదు. 2019 వెబ్‌ ల్యాండ్‌ ప్రకారమే అన్నదాత సుఖీభవ ఇచ్చేవారు. దీంతో వేలాది మంది రైతులు ఇబ్బంది పడేవారు.

మండలం మొత్తం అర్హులు అనర్హులు

ఆదోని 32,866 19,190 13,676

కౌతాళం 25,365 14,869 10,496

కోసిగి 16,588 9,887 6,701

పెద్దకడుబూరు 16,255 9,802 6,453

మొత్తం 91,074 53,748 37,326

రైతుల జాబితా సిద్ధం చేశాం

‘అన్నదాత సుఖీభవ’కు గ్రామాల వారీగా రైతుల జాబితాను సిద్దం చేశాం. త్వరలోనే వారి ఖాతాల్లో మొదటి విడత సాయం జమవుతుంది. తమ పేర్లు లేని రైతులు రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు అందించవచ్చు. - బాలవర్థిని రాజు, ఏడీఏ, ఆదోని

Updated Date - Jul 22 , 2025 | 12:48 AM