ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు ఆజ్యం

ABN, Publish Date - Jul 18 , 2025 | 12:13 AM

మాజీ సీఎం జగన్‌ రౌడీమూకలను, గూండాలను పరామర్శిస్తూ గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు ఆజ్యం పోస్తున్నారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం యాగంటిపల్లె గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.

మహిళలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

వైసీపీ తాటాకు చప్పళ్లకు భయపడం

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం

రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌ రౌడీమూకలను, గూండాలను పరామర్శిస్తూ గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు ఆజ్యం పోస్తున్నారని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం యాగంటిపల్లె గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. మంత్రి బీసీకి గ్రామ టీడీపీ నాయకులు బండి మౌళీశ్వరరెడ్డి, కుమార్‌స్వామిరెడ్డి, మహేశ్వరరెడ్డి, యాగంటిపల్లె దస్తగిరి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి. టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి బీసీ మాట్లాడారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు టీడీపీ నాయకులు భయపడే ప్రసక్తేలేదని అన్నారు. ఎన్నికల వేళ తాము ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ను అమలు చేస్తున్నామన్నారు. జగన్‌ పరదాల పాలన సాగించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. యాగంటిపల్లె గ్రామంలో తాను నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను కూడా అడ్డుకొని నీరు అందకుండా చేసిన ఘనత వైసీపీ నాయకులది అన్నారు. విజనరీ లీడర్‌ అయిన సీఎం చంద్రబాబునాయుడు లోటు బడ్జెట్‌ ఉన్నా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థలో నారాలోకేశ్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. సుపరిపాలన కరపత్రాలు గ్రామంలో మంత్రి బీసీ పంపిణీ చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మౌళీశ్వర రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, బండి కుమార్‌రెడ్డి, మహేశ్వరరెడ్డి, దస్తగిరి, పాతపాడు సర్పంచ్‌ మహేశ్వరరెడ్డి, భూషన్న, ఆర్‌సీ నాగిరెడ్డి, చిన్నస్వామి, షేక్షావలి, బాలనాయుడు, కృష్ణానాయక్‌, తిరుమలేశ్‌, డీఈలు నాగశ్రీనివా సులు, మధుసూదన్‌, ఏఈ సాయికృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 12:13 AM