ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధిలో లక్ష్యాలను అధిగమించాలి

ABN, Publish Date - Jul 02 , 2025 | 12:26 AM

ఉపాధి హామీలో ప్రగతి లక్ష్యాలను వందశాతం అధిగమించాలని కలెక్టర్‌ రాజకుమారి ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల టౌన్‌ జూలై 1(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీలో ప్రగతి లక్ష్యాలను వందశాతం అధిగమించాలని కలెక్టర్‌ రాజకుమారి ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. మంగళవార స్థానిక డ్వామా కార్యాలయంలో ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బందితో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాఽధి హామీ పథకం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పనిని తప్పనిసరిగా కల్పించాలన్నారు. పండ్ల తోటల పెంపకం, లేబర్‌ టార్గెట్‌ సరాసరి దినసరి వేతనం, నీటి కుంటలు, సోక్‌ పిట్స్‌, కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌ తదితర అంశాలతో మండలాల వారీగా ప్రగతిపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సూర్యనారాయణ, ఎంఆండ్‌ఈ భాస్కర్‌నాయుడు, ఏపీడీలు నరసింహారెడ్డి, సాంబశివరావు, అన్వరాబేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:26 AM