ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు

ABN, Publish Date - May 11 , 2025 | 10:54 PM

ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల 1997-2000 బ్యాచ్‌ బీకాం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు.

ఆదోని ఆర్ట్స్‌ కళాశాలలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు

ఆదోనిలో డిగ్రీ, వెల్దుర్తి, మద్దికెరలో పదో తరగతి విద్యార్థులు

ఆదోని అగ్రికల్చర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల 1997-2000 బ్యాచ్‌ బీకాం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 25 ఏళ్ల అనంతరం తమ స్నేహితులను కలుసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. తాము చదివిన తరగతి గదిలోకి వెళ్లి తమ తోటి స్నేహితులతో నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వివిధ వృత్తులు, ప్రాంతాల్లో స్థిరప డిన వారంతా కలుసుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహకులు రాయ చోటి సుబ్బయ్య, మంజునాథ్‌ ఉపేంద్ర తెలిపారు. కామర్స్‌ హెచ్‌వోడీ చంద్రశేఖర్‌, కళాశాల అధ్యక్షుడు సనత్‌ కుమార్‌ను సన్మానించారు

2001-02 పదో తరగతి విద్యార్థులు..

వెల్దుర్తి: జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2001-02 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు కలుసుకున్నారు. అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉపాధ్యాయులు పద్మశ్రీ, రేవతి, ఫాతీమా, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, రఫిక్‌ను సన్మానించి జ్ఞాపిక అందజేశారు. మిత్రుడు చెన్నకేశవులుకు రూ.30వేలు సాయం చేశారు.

2004-05 బ్యాచ్‌ విద్యార్థులు..

మద్దికెర, మే 11 (ఆంధ్రజ్యోతి):మండల కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల 2004-05 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. 20 ఏళ్ల అనంతరం కలిసి ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులలను సన్మానించారు.

Updated Date - May 11 , 2025 | 10:54 PM