ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అపూర్వ సమ్మేళనం

ABN, Publish Date - May 11 , 2025 | 12:29 AM

: కొలిమిగుండ్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

ఉపాధ్యాయులతో జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు

కొలిమిగుండ్ల, మే 10 (ఆంధ్రజ్యోతి) : కొలిమిగుండ్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో 2002-2003లో పదో తరగతి విద్యనభ్యసించిన విద్యార్థులు శని వారం కలుసుకున్నారు. అలనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తమకు విద్యను బోధించిన గురువులు వైవీఎస్‌ నారాయణరెడ్డి, బాలసుబ్బా రెడ్డి, విజయప్రసన్న, రాఘవేంద్ర ప్రసాద్‌, శేష మరాజు, రమణారెడ్డి తదితరులను ఘనంగా సన్మానించారు. పూర్వపు విద్యార్థులంతా కలిసి తమ మిత్రులకు ఆర్థికసాయం చేశారు. పాఠశా ల అభివృద్ధి కోసం విరాళం అందజేశారు.

శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో..

బేతంచెర్ల: పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో శనివారం 1990-91లో పదవ తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు. దాదాపు 34 ఏళ్ల తర్వాత కుటుంబ సమేతంగా కలు సుకున్నారు. అనంతరం గురువులు రామశర్మ, ఆదినారా యణ, హనీఫ్‌, నాగభూషణం, తిరుపాల య్యను పూర్వ విద్యార్థులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎంపీపీ బుగ్గ న నాగభూషణం రెడ్డి, బేతంచెర్ల నగర పంచాయతీ చైర్మన్‌ చలంరెడ్డి, నరసింహనాయుడు, విజయుడు, బాషా, నడిపి హుశేన్‌, చంద్ర, పూర్వ విద్యార్థినులు అమరావతి, చంద్రకళ, ధనలక్ష్మి, భారతి, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:30 AM