పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం
ABN, Publish Date - May 07 , 2025 | 12:34 AM
పండ్ల తోటలు సాగు చేసే చిన్న,సన్న కారు రైతులకు ప్రభుత్వం ప్రోత్సా హం అందిస్తుందని డ్వామా పీడీ వెంకట రమణయ్య అన్నారు.
డ్వామా పీడీ వెంకట రమణయ్య
ఆలూరు రూరల్, మే 6 (ఆంధ్రజ్యోతి): పండ్ల తోటలు సాగు చేసే చిన్న,సన్న కారు రైతులకు ప్రభుత్వం ప్రోత్సా హం అందిస్తుందని డ్వామా పీడీ వెంకట రమణయ్య అన్నారు. మంగళవారం పెద్దహోతూరు ఉపాధిహామీ పథకం కించ చేసిన నీటి కుంటలు పండ్ల తోటలను పరిశీలించారు. ఐదు ఎకరాలల్లోపు పొలం ఉన్న రైతులకు మామిడి, జామ, సపోట తదితర మొక్కలు అందిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనుల్లో 1.06లక్షల మంది పని చేస్తున్నారు. మే చివరి నాటికి 2వేల నీటి గుంతలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. పెండింగ్ ఉపాధి కులీలకు వేతనాలను వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. సీసీ రోడ్లు, గోకల షెడ్ల బిల్లులు త్వరలో విడుదల అవుతాయని తెలిపారు. ఏపీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
Updated Date - May 07 , 2025 | 12:34 AM