ఉపాధి కూలీ బకాయిలు త్వరలో జమ
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:14 AM
ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన రూ.961.46 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని జిల్లాల వారీగా కేటాయింపులు చేసి త్వరలోనే ఉపాధి పనులు చేస్తున్న కూలీల బ్యాంకు అకౌంట్లకు జమ చేయనున్నట్లు ఉమ్మడి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లు వెంకటరమణ, వెంకట సుబ్బయ్య తెలిపారు
డ్వామా పీడీలు వెంకట రమణ, వెంకట సుబ్బయ్య
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన రూ.961.46 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, వీటిని జిల్లాల వారీగా కేటాయింపులు చేసి త్వరలోనే ఉపాధి పనులు చేస్తున్న కూలీల బ్యాంకు అకౌంట్లకు జమ చేయనున్నట్లు ఉమ్మడి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లు వెంకటరమణ, వెంకట సుబ్బయ్య తెలిపారు. ఫిబ్రవరి నుంచి కూలీలకు రావాల్సిన బకాయిలు కొద్ది రోజుల్లోనే వారి ఖాతాలకు జమ కానున్నాయి. కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఇటీవల పలు మార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర అధికారులకు విజ్ఞప్తి చేశారని, ఈ క్రమంలోనే కూలీల వేతనాలు విడుదలైనట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేతన బకాయిలు దాదాపు రూ.150 కోట్ల దాకా రావాల్సి ఉందని ఈ వేతన బకాయిలు అందిన వెంటనే మెటీరియల్ కాంపొనెంట్ కింద రావాల్సిన నిధులు కూడా త్వరలోనే మంజూరవుతాయని నీటి యాజమాన్య సంస్థ అధికార వర్గాలు తెలిపాయి.
Updated Date - Apr 23 , 2025 | 12:14 AM