ఇష్టారాజ్యంగా..
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:10 AM
రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్‌లో కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్లు, విద్యార్థుల మధ్య పోరుకు ఆజ్యం పోస్తున్నారు. ఏళ్ల తరబడి విధులకు హాజరుకాకుండానే నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. దర్జాగా కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు విద్యార్థి నాయకులను అడ్డు పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు.
ఏళ్ల తరబడి ఉద్యోగుల హవా
ఆర్‌యూలో విధులకు రాకుండానే జీతాలు
అంతర్గత బదిలీలపై
బ్లాక్‌మెయిల్.. బెదిరింపులు?
దర్జాగా ‘రియల్’ దందాలు
అవకతవకలు కట్టడి చేస్తాం: వీసీ
కర్నూలు అర్బన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్‌లో కొందరు ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్లు, విద్యార్థుల మధ్య పోరుకు ఆజ్యం పోస్తున్నారు. ఏళ్ల తరబడి విధులకు హాజరుకాకుండానే నెలనెలా వేతనాలు తీసుకుంటున్నారు. దర్జాగా కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు విద్యార్థి నాయకులను అడ్డు పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు.
హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో..
తాజాగా పీజీ, బీటెక్ పరీక్షలు ఈనెల 7నుంచి ప్రారంభమ య్యాయి. పరీక్ష ప్రారంభమై రెండు రోజులు గడిచినా విద్యార్థుల కు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో క్లర్క్‌ను సంప్రదించారు. హాల్‌టికెట్లు అవసరం లేదు.. వెళ్లండంటూ విద్యార్థులను చీదరిం చుకున్నాడు. పరీక్షా కేంద్రంలో ఓ హెచ్‌వోడీ విద్యార్థులకు హాల్ టికెట్లు లేకపోయినా బీటెక్ విద్యార్థులను పరీక్షలకు అనుమతిం చాడు. ఈ అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా ఉన్నాయి. ఉద్యోగులు విధులకు హాజరు కాకుండానే బరితెగించి మాట్లాడిన తీరుపై పలువురు విద్యార్థి నాయకులు అసహనం వ్యక్తం చేస్తు న్నారు. నియంత్రణ, పర్యవేక్షణ చేపట్టాల్సిన హెచ్‌వోడిలకు సైతం వారి శాఖలపై పట్టులేక.. ఏసీ రూమ్‌ల్లో కాలక్షేపానికి మితమయ్యారనే విమర్శలున్నాయి. గాడిన పెట్టాల్సిన ఓ ఉన్నతాఽ ధికారిని చీటి కేసీ నీ బండారం బయట పెడతానని ఓ చిరుద్యోగి బ్లాక్ మెయిల్.. బెదిరింపులకు పాల్పడుతున్నారని ఓ ప్రొఫెసర్ వద్ద వాపోయే పరిస్థితి వర్సిటీ క్యాంపస్ కొట్టుమిట్టాడుతోందని విద్యార్థులు వాపోతున్నారు.
రాజకీయ నాయకుల పేర్లతో..
రాజకీయ నాయకుల పేర్లను చెప్పుకొని కొందరు ఉద్యోగులు అధికారుల ఎదుట చెలరేగిపోతున్నారు. మరో ఉద్యోగి విద్యార్థి సంఘా లన్నీ నేను చెప్పినట్లే ముందుకు అడుగులేస్తాయని ఇలా కొందరు ఉద్యోగులు స్వంత అజెండా అమలు చే సుకుం టున్నారు. క్యాంపస్‌లో బోధనేతర ఉద్యోగులు 236 మంది ఉండగా అందులో 50మందికి పైగా విధులకు హాజరుకా కుండానే నెలానెలా జీతాలు తీసుకుం టున్నారని మరి కొందరు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. విధులకు హజరయ్యే ఉద్యోగు లకు ఒక్కొక్కరి నుంచి నెలనెలా రూ.50 అసోసియేషన్ పేరుతో ఏళ్ల తరబడి కొందరు వ్యక్తులు కాజేస్తున్నారు. అలా జరగకుండా చూడాలని ఇటీవల కొందరు ఉద్యోగులు ఉపకులపతికి ఫిర్యాదు చేశారు.
అంతర్గత బదిలీలు చేస్తే చిట్టా విప్పుతా?
ఏళ్ల తరబడి ఫెవికాల్ వీరులుగా కొందరు ఉద్యోగులు కీలక స్థానాల్లో తిష్ట వేశారని కొందరు ఉద్యోగులు ఇటీవల ఉపకుల పతికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉపకులపతి అందుకు సంబందించిన ఫైల్ సిద్ధంచేయాలని ఆదేశించినా సంబంధిత అధికారి సాహసించ లేకపోతున్నారు. ఓ కీలక ఉద్యోగి ఓ అధికారికి సంబందించిన చిట్టా బయట పెడతానని హెచ్చరికలు జారీ చేశారనే చర్చ క్యాంపస్‌లో చక్కర్లు కొడుతోంది. రీసెర్చ్, ఎస్టాబ్లిస్ మెంట్, సీడీసీ, పరీక్షల విభాగం, ఇలా కొన్ని కీలక శాఖలో కొందరు ఉద్యోగులను ఏళ్ల తరబడి ఎలా కొనసాగి స్తారని అసోసియేషన్ నాయకులు మండిపడుతున్నారు. వారిని వెంటనే తొలగించాలని లేని పక్షంలో తాము విధులు బహిష్కరి స్తామని హెచ్చరిస్తున్నారు. దశాబ్దకాలంగా ఒకే సీటులో కొంద రినే కొనసాగించడం వెనుక మాజీ ఉన్నతాధికారి తెరవెనుక ఉంటూ వారికి అండగా ఉండటం. వారి పెత్తనం క్యాంపస్‌లోని ఉన్నతాధికారులను శాసించే స్థాయికి చేరుకుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఫేస్ రీడింగ్ అమలుతో కట్టడి చేస్తాం
ఫేస్ రీడింగ్ ద్వారా ఉద్యోగుల విధుల హాజరు తీరులో అవకతవకలను కట్టడి చేస్తాం. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడానికి సంబంధించి హెచ్‌వోడీలు పర్యవేక్షించాలి. ఆపై ఏదైనా ఉంటే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉం టుంది. పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకుంటాం. అంతర్గత బదిలీలు చేప డతాం. - వి. వెంకట బసవరావు, ఉపకులపతి , ఆర్‌యూ
Updated Date - Jul 11 , 2025 | 12:10 AM