ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎలక్ర్టానిక్‌ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు: ఎమ్మెల్యే

ABN, Publish Date - Apr 20 , 2025 | 12:54 AM

ఎలక్ర్టానిక్‌ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకోవా లని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు.

నంద్యాల చెక్‌పోస్టులో స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ఎలక్ర్టానిక్‌ వ్యర్థాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకోవా లని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. 20వ వార్డు నంద్యాల చెక్‌పోస్టులో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసం దర్భంగా గౌరు చరిత మాట్లాడుతూ సమాజంలో ఎలక్ర్టానిక్‌ పరికరాల వినియోగం అధికంగా ఉందని, వాటిని డిస్పోజ్‌ చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-వేస్ట్‌తో భవిష్యత తరాలకు సంభవించే నష్టాలను గుర్తించి వాటిని రీసైక్లింగ్‌ చేసేలా చర్యలు చేపట్టిందన్నారు. కార్పొరేషన, గ్రామ పంచాయతీల్లో అధికా రులు తీసుకోవాల్సిన యాక్షనప్లాన సిద్ధం చేయాలని ప్రభుత్వం అదే శించిందని ఆదిశగా అధికారులు పనిచే యాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి, సిబ్బంది సేకరించిన ఈ-వేస్ట్‌ను కేంద్రాలకు పంపాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కల్లూరు అర్బన 16 వార్డుల ఇనచార్జి పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్‌, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి పాల్గొన్నారు.

కర్నూలు రూరల్‌: పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత అని జిల్లా పరిషత ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాసరరెడ్డి అన్నారు. కర్నూలు మండలం బి. తాండ్రపాడు గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచు జయన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఈవో మాట్లాడుతూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ దేశంలో నెంబర్‌వన రాష్ట్రంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు ఉద్దేశమన్నారు. అందులో భాగంగా నెలలో ప్రతి మూ డో శనివారం స్వచ్ఛంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి మాట్లాడుతూ ఎలక్ర్టిక్‌ వ్యర్థాల పునర్వినియోగం కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. తాండ్రపాడు సర్పంచు జయన్న మాట్లాడుతూ ప్రతి మూడో శనివా రం గ్రామంలో స్వచ్ఛ దివస్‌పై ర్యాలీ నిర్వహిస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘునాథ్‌, పంచాయతీ కార్యదర్శి గోపాల్‌ పాల్గొన్నారు.

కర్నూలు ఎడ్యుకేషన్‌: స్థానిక బీ.క్యాంపు జూనియర్‌ కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగస్వామి నాయక్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల ప్రాంగణంలో వ్యర్థాలను తొలగించారు. అధ్యాపకులు విజయశేఖర్‌, మల్లికార్జున, విద్యార్థులు పాల్గొన్నారు.

కర్నూలు న్యూసిటీ: జిల్లా పరిషత కార్యాలయంలో శనివారం స్వచ్ఛాంద్ర - స్వచ్ఛ దివాస్‌ కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాసరరెడ్డి మాట్లాడుతూ ఈ-వ్యర్థాలు ఎల క్ర్టానిక్‌ వేస్ట్‌ పదార్థాలు భూమి, నీరు, గాలిని కలుషితం చేయడం ద్వారా పర్యావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయని అన్నారు.

ఓర్వకల్లు: పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్‌ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఓర్వకల్లు, నన్నూరు, ఉయ్యాలవాడ, లొద్దిపల్లె, హుశేనాపురం, సోమయాజులపల్లె, బ్రాహ్మణ పల్లె, కొమరోలు, తదితర గ్రామాల్లో గ్రామస భలు నిర్వహించి స్వచ్ఛ భారతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సచివాలయ సిబ్బంది, పొదుపు మహిళలు పాల్గొన్నారు.

గూడూరు: గూడూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుదామని కమి షనర్‌ రమేష్‌బాబు అన్నారు. శనివారం గూడూరు నగర పంచా యతీ పరిధిలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర కార్యక్ర మంలో భాగంగా ర్యాలీ నిర్వహించి పాతబ స్టాండులో ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్‌ మాట్లా డుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల న్నారు.. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ ధనుంజ యరెడ్డి, మేనేజర్‌ విజయలక్ష్మి, శాని టరీ ఇన్సపెక్టర్‌ నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2025 | 12:54 AM