ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:51 PM
తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఆల్ ఇండియా గ్రామీణ తపాలా
ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటేశ ్వర్లు
నంద్యాల రూరల్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తపాలా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండలంలోని చాబోలు గ్రామంలోని ఏఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో తపాలా ఉద్యోగుల 14వ దైవార్షిక మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదో వేతన కమిటీలో జీడీఎస్‌లను చేర్చడంపై చర్చించారు. ప్రభుత్వం చర్చించి తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర డివిజన్ అధ్యక్షుడిగా కృష్టయ్య, రాష్ట్ర కార్యదర్శిగా మర్రెడ్డి, కోశాధికారి నారాయణ, రాష్ట్ర మహిళా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
Updated Date - Jul 17 , 2025 | 11:51 PM