ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఈగల్‌’ ఆన్‌ డ్యూటీ..!

ABN, Publish Date - Jun 07 , 2025 | 11:33 PM

రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నేరాలను ఎదుర్కొవడానికి మాదకద్రవ్యాల నిరోధక విభాగం ఈగల్‌ (ఎలైట్‌ యాంటి-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌)ను ప్రారం భించింది. గంజాయి, డ్రగ్స్‌ వంటి వాటిని నిరోధించేం దుకు ‘ఈగల్‌’ పనిచేస్తోంది.

డ్రగ్స్‌, గంజాయి వాడకంపై ప్రత్యేక దృష్టి

సోషల్‌ మీడియా పర్యవేక్షణ

డార్క్‌ వెబ్‌పై నిఘా

ఆన్‌లైన్‌లో జరిగే డ్రగ్స్‌ విక్రయాల గుర్తింపు

స్మగ్లర్ల ప్రొఫైలింగ్‌, వారి ఆర్థికమూలాల విశ్లేషణ

ఉమ్మడి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు

టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1972

కర్నూలు క్రైం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నేరాలను ఎదుర్కొవడానికి మాదకద్రవ్యాల నిరోధక విభాగం ఈగల్‌ (ఎలైట్‌ యాంటి-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌)ను ప్రారం భించింది. గంజాయి, డ్రగ్స్‌ వంటి వాటిని నిరోధించేం దుకు ‘ఈగల్‌’ పనిచేస్తోంది. దీన్ని కాల్‌ సెంటర్‌ 24గంటలు అందుబాటులో ఉంటుంది.

మాదక ద్రవ్యాల నిరోధక విభాగమే..

ఈగల్‌ అంటే మాదక ద్రవ్యాల నేరాలను ఎదుర్కొనేందుకు మాదక ద్రవ్యాల నిరోధక విభాగమే ఈగల్‌. సోషల్‌ మీడియా పర్యవేక్షణ, అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారుల నెట్‌వర్క్‌, ఆన్‌లైన్‌లో జరిగే డ్రగ్స్‌ విక్రయాలను గుర్తించి అడ్డుకోవడం, డార్క్‌వెబ్‌పై నిఘా వంటి చర్యలతో పాటు వివిధ విభాగాల ద్వారా సమాచార సేకరణ, స్మగ్లర్ల ప్రొఫైలింగ్‌, వారి ఆర్థికమూలాల విశ్లేషణ ద్వారా డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి సమూ లంగా నిర్మూలించడంపై ఈగల్‌ పనిచేస్తుంది. కొరియర్ల స్మగ్లర్లు నుంచి స్వాధీనం చేసుకునే సెల్‌ఫోన్లు, వివిధ పరికరా లను డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ద్వారా విశ్లేషించి కింగ్‌ఫిన్‌లను ప ట్టుకుంటారు. మారుమూల ప్రాంతాల్లో జరిగే గంజాయి సాగు ప్రాంతాల్ని డ్రోన్లు, శాటిలైట్‌ చిత్రాల ద్వారా గుర్తించి ధ్వంసం చేయనుంది. రాష్ట్ర సరిహద్దులు, గంజాయి రవాణా చేసే మార్గాల్లో కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాలు, ఫేషియల్‌ రికగ్నే షన్‌ ఆటోమేటెడ్‌ నెంబర్‌ ప్లేట్ల రికగ్నేషన్‌ వంటివి ఉపయోగిస్తారు. అమరావతిలో ప్రధాన కార్యాలయం ఉంది. ఈగల్‌లో 26 నియం త్రణ కణాలు, ప్రత్యేక కోర్టులు ఉన్నాయి.

కాల్‌ సెంటర్‌ 24 గంటలు..

డ్రగ్స్‌, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌.1972ను ఏర్పాటు చేసింది. అమరావతి ప్రధాన కేంద్రంలోని కాల్‌ సెంటర్‌ 24 గంటలు పనిచేస్తుంది. ఈగల్‌, నార్కోటిక్స్‌ పోలీస్‌ స్టేషన్‌, జిల్లా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ విభాగాల్లో కలిపి మొత్తం 459 మంది సిబ్బంది పనిచేస్తారు. 249 మందిని ప్రధాన కార్యాలయానికి, 66 మందిని నార్కోటిక్స్‌ స్టేషన్‌కు, 114 మందిని జిల్లా విభాగాలకు కేటాయించారు. వీరందరినీ పోలీసు శాఖలోని వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. అనంతరం వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ విభాగంలో పని చేసే వారికి 30 శాతం అదనంగా అలవెన్సు కూడా ఇవ్వనున్నారు. 12మంది కాల్‌ టేకర్లతో కూడిన టోల్‌ఫ్రీ, సెంట్రల్‌ కంట్రోల్‌ రూం కమ్యూనికేషన్‌, వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. పారదర్శకతను నిర్ధారించడానికి, దుర్వినియోగాన్ని నిరోధించడానికి, సీజ్‌ చేయబడిన మాదక ద్రవ్యాలను సీసీ టీవీ నిఘాతో కూడిన సెంట్రల్‌ డిపాజిటరీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. రాష్ట్రస్థాయిలో నాలుగు టాస్క్‌ఫోర్సు బృందాలు ఉంటాయి. అమరావతిలో నార్కోటిక్స్‌ పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్రమంతటా పరిధి కల్పించారు. ఇక్కడి సిబ్బంది ఏపీలో ఎక్కడైనా సరే డ్రగ్స్‌, గంజాయి సంబంధిత కేసుల నమోదు, దర్యాప్తు చేయొచ్చు. డీఎస్పీ స్థాయి అదికారి ఈ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా వ్యవహరిస్తారు.

జిల్లాలో ఈగల్‌ పాత్ర

జిల్లా వ్యాప్తంగా ఈగల్‌ టీం ఏర్పాటైంది. ఓ ఎస్‌ఐతో పాటు ఐదారు మంది ఈగల్‌ టీమ్‌లో పని చేస్తున్నారు. విద్యార్థులు, యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా రక్షించడం, వివిధ కార్యక్రమాలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ 1972 ద్వారా సమాచారం సేకరించడం, మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి పునరావాస కేంద్రాలను తరలించడం వంటి ఈగల్‌ టీం ముఖ్య ఉద్దేశం.

వివిధ కార్యక్రమాల నిర్వహణ

మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించేందుకు వివిధ కార్యక్ర మాలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. సిబ్బందికి మాదకద్రవ్యాల వినియోగం యొక్క సంకేతాలను ఎలా గుర్తించాలో వివరిస్తారు. మాదక ద్రవ్యాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించడం, వారిని ఎలా సంప్రదించాలో వివరిస్తున్నారు. మాదక ద్రవ్యాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. గంజాయి పెంచిన.. పంచినా.. పీల్చినా నేరం అని దానికి శిక్షలు కూడా ఉన్నాయని సిబ్బంది వివరిస్తున్నారు.

నిషేధం మాటున వాడకం

జిల్లాలో డ్రగ్స్‌ వినియోగం చాపకింద నీరులా సాగుతుంది. చెన్నై, బెంగుళూరు ప్రాంతాల నుంచి మత్తుమందు జిల్లాకు దిగుమతి అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల జిల్లాలో గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. రెండేళ్ల క్రితం తాలుకా సీఐ ఓగంజాయి బ్యాచ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తే సుమారు 30మందికి పైగా కళాశాల విద్యార్థులు గంజాయి వాడుతున్నట్లుగా గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. గంజాయి వాడకం ముఖ్యంగా ప్రధాన వైద్య విభాగంలోని విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల విజిలెన్స్‌ అధికారులు కూడా దాడులు చేస్తే కొన్ని మందుల షాపుల్లో కూడా మత్తును కలిగించే కొన్ని డ్రగ్స్‌ను ఎలాంటి ప్రిస్కిప్షన్‌ లేకుండానే ఇస్తున్నట్లు గుర్తించి వారిపై కేసులు కూడా నమోదు చేశారు.

Updated Date - Jun 07 , 2025 | 11:34 PM