ఎండు మిర్చి ధర పతనం
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:56 PM
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఎండు మిర్చి ధరలు భారీగా పతనమయ్యాయి.
ఆదోని అగ్రికల్చర్, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఎండు మిర్చి ధరలు భారీగా పతనమయ్యాయి. శనివారం ఎండుమిర్చి ధర క్వింటం గరిష్ఠంగా రూ.7302 పలికింది. గత 15 రోజులతో ధరలు పొల్చితే క్వింటానికి గరిష్ఠంగా రూ.6వేలకు పైగా ధర పతనమైంది. ఎండుమిర్చి రైతులు ధరలు పతనం కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.1.50 లక్షలు పైగా అవుతుందని, పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. 1,360 బస్తాల ఎండుమిర్చి విక్రయానికి రాగా కనిష్ఠ ధర క్వింటం రూ.2 వేలు, మధ్యస్థ ధర, రూ.6201 పలికింది.
Updated Date - Apr 19 , 2025 | 11:56 PM