ముగిసిన డ్రోన టెక్నాలజీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ
ABN, Publish Date - Jun 30 , 2025 | 01:04 AM
డ్రోన టెక్నాలజీలో రాబోయే కాలంలో జరిగే మార్పులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో ప్రగతి సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ర్టార్ డా. కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
కర్నూలు ఎడ్యుకేషన్, జూన 29 (ఆంధ్రజ్యోతి): డ్రోన టెక్నాలజీలో రాబోయే కాలంలో జరిగే మార్పులకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో ప్రగతి సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ర్టార్ డా. కట్టా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం జగన్నాథగట్టు ట్రిపుల్ ఐటీ డీఎంలో క్లస్టర్ యూనివర్సిటీ అధ్యాపకులకు డ్రోన టెక్నాలజీ నైపుణ్యాభివృద్ధి ముగింపు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్థాపించబోతున్న డ్రోన హబ్‌కు అనుగుణంగా డ్రోన టెక్నాలజీలో విద్యార్థులను ఉద్యోగానికి సిద్ధం చేసేలా అధ్యాపకులు శిక్షణ ఇస్తామన్నారు. డా. పద్మావతి మాట్లాడుతూ డ్రోన టెక్నాలజీ డాల్ఫిన డ్రీమ్ టెక్నాలజీ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డా. కృష్ణ నాయక్, డా. శ్రీహరిపత్రి, ప్రిన్సిపాల్ కే.వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 01:04 AM