ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి

ABN, Publish Date - Apr 05 , 2025 | 01:02 AM

నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు.

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మిగనూరు, నందవరం, గోనె గండ్ల, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఆర్‌డబ్యూఎస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు మండలాల్లో ఎక్కడెక్కడ, ఏఏ గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ కూడా ఈ వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బోర్లు, ట్యాంకులు మరమ్మతులు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓలు బంగారమ్మ, మనోరంజని, పుల్లయ్య, ఆర్‌డబ్లూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే: ఎమ్మిగనూరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి కలిశారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరం మండలాల్లో తాగునీటి సమస్యపై సమీక్షించారు. అంతకు ముందు సబ్‌ కలెక్టర్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌డ బ్ల్యూఎస్‌ ఈఈ పద్మజ, డీఎల్‌పీవో నూర్జహాన, తహసీల్దార్‌ శేషఫణి, శ్రీనివాసులు, కుమారస్వామి, కమిషనర్‌ గంగిరెడ్డి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 01:02 AM