ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోరుకల్లు నుంచి తాగునీరు

ABN, Publish Date - May 18 , 2025 | 12:50 AM

గోరుకల్లు నుంచి తాగునీరు

పాణ్యం నియోజకర్గంలో రోడ్లకు రూ.50 కోట్లు

సీ-క్యాంప్‌ రైతు బజారు అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు

ఓర్వకల్లు కేంద్రంగా పలు పరిశ్రమలు స్థాపన

కర్నూలు నుంచి ఓర్వకల్లుకు రైల్వేలైన్‌, నీటి వసతి

సీఎం చంద్రబాబు హామీ

డాక్టర్‌ అంబేడ్కర్‌, అబ్దుల్‌ కలాంలు పేద కుటుంబంలో జన్మించినవారే

నేను 8 కిలోమీటర్లు నడిచి చదువుకున్నాను

జైరాజ్‌ ఇస్పాత్‌ కంపెనీ నిర్మించే స్వచ్ఛాంధ్ర పార్కుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు

కర్నూలు, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘కర్నూలు, కల్లూరు అర్బన్‌ వార్డుల్లో గోరుకల్లు జలాశయం నుంచి తాగునీటి అందిస్తాం. ఈ బృహత్తర కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడుతాం. రహదారుల నిర్మాణాల కోసం రూ.50 కోట్లు కేటాయిస్తున్నా..’ అని చంద్రబాబు కర్నూలు, కల్లూరు అర్బన్‌ వార్డులపై వరాలజల్లు కురిపించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎంపీ బైరెడ్డి శబరి విజ్ఞప్తి మేరకు పాణ్యం నియోజకవర్గంలోకి వచ్చే వార్డులకు తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు శనివారం కర్నూలు జిల్లా పాణ్యం, కర్నూలు నియోజకవరాల పరిధిలోని పలు అర్బన్‌ వార్డుల్లో పర్యటించారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి చంద్రబాబు రోడ్డు మార్గంలో గుత్తిరోడ్‌ మీదుగా సీ.క్యాంప్‌ రైతు బజారుకు చేరుకున్నారు. అక్కడ రైతులతో మాట్లాడారు. కూరగాయాలు కొనుగోలు చేశారు. కూరగాయాల వ్యర్థాలను ఎరువులుగా తయారు చేసే ప్రక్రియను చంద్రబాబు పరిశీలించారు. పారిశుధ్య కార్యికులతో కలసి రైతు బజారులో పరిశీలించారు. ఎలాంటి సెక్యూరిటీ, రాష్ట్ర, జిల్లా అధికారులు దగ్గరకు రానివ్వకుండా చంద్రబాబు, ఇద్దరు పారిశుధ్య కార్మికులు అయ్యమ్మ, వెంకటేష్‌లతో మాత్రమే వెళ్లి రైతు బజారులో కలియతిరిగారు. అక్కడి నుంచి కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజావేదికకు చంద్రబాబు చేరుకున్నారు. వివిధ స్టాల్స్‌ను పరిశీలించారు. పీ-4 విధానంలో భాగంగా అమలు చేస్తున్న మార్గదర్శి-బంగారు కుటుంబాలతో మాట్లాడారు. జిల్లా పర్యటన కోసం అమరావతి నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి 12.30 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. మంత్రులు నారాయణ, ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి, గిత్తా జయసూర్య, పార్థసారథి, కేఈ శ్యాంబాబు, సీనియర్‌ నాయకులు గౌరు వెంకటరెడ్డి, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి, కర్నూలు, నంద్యాల జిల్లాల టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్‌, మాజీ మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కేఈ ప్రభాకర్‌, కలెక్టరు పి.రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తదితరులు ఘన స్వాగతం పలికారు. రైతు బజార్‌ నుంచి సీఎం చంద్రబాబు నేరుగా నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో మాట్లాడారు. కల్లూరు అర్బన్‌ 16 వార్డుల ప్రజలకు గోరుకల్లు రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నీటిని మళ్లించి శుద్ధిచేసి అందిస్తామని హామీ ఇచ్చారు. ఓర్వకల్లును డ్రోన్‌ హబ్‌గా మారుస్తామని అన్నారు. ఇండస్ట్రియల్‌ నోడ్‌ కింద రూ.2,860 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామని, రైల్వేలైన్‌, నీటి వసతి ఏర్పాటు చేస్తామని చంద్రబాబు వివరించారు.

దేశానికే తలమానికం గ్రీన్‌ ఎనర్జీ

ఓర్వకల్లును డ్రోన్‌ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ గ్రీన్‌కో సోలార్‌ పవర్‌ యూనిట్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ యూనిట్‌, జైరాజ్‌ ఇస్పాత్‌ పరిశ్రమ, డీఆర్‌డీవో వచ్చాయి. మరి న్ని పరిశ్రమలు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమలో ఉత్పత్తి చేసే గ్రీన్‌ ఎనర్జీ దేశానికే తలమానికంగా నిలిచింది. ఉమ్మడి కర్నూలు ప్రజలు నన్ను గౌరవించారు. వారి రుణం తీర్చుకుంటానన్నారు.

ఓర్వకల్లు పాలకోవా బ్రహ్మాండం

‘ఒకనాడు పేదరికంలో ఎన్నో కష్టాలు పడ్డారు. నేను తీసుకొచ్చిన పొదుపు ఉద్యమం ద్వారా ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఐదు బంగారు కుటుంబాలకు మార్గదర్శుకులై ఓర్వకల్లు పొదుపు మహిళలు ఆదర్శంగా నిలిచారు. ఓర్వకల్లు పాలకోవా బ్రహ్మండంగా ఉంటుంది. డ్వాక్రా, మెప్మా ద్వారా మరింత ప్రోత్సాహం అందిస్తాం. డ్వాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకు భయం. గ్రామాల్లో వారికి మంచి గౌరవం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే గౌరు చరిత ఇద్దరూ మహిళలు. వారిని చట్టసభలకు పంపిన ఘనత టీడీపీదే’ అని చంద్రబాబు అన్నారు.

సీ.క్యాంప్‌ రైతు బజారు అభివృద్ధికి రూ.6 కోట్లు

‘మంత్రి టీజీ భరత్‌ విజ్ఞప్తి మేరకు సి.క్యాంప్‌ రైతు బజారు అభివృద్ధికి రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నాను. అండర్‌గ్రౌండ్‌లో పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తా. రాష్ట్రంలోనే ఉత్తమ రైతు బజారుగా తీర్చిదిద్దుతా..’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతు బజారులో పర్యటిస్తూ పండ్లు, పూలు, కూరగాయలు అమ్మే రైతులతో మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో పంటలు వేశారు.. రోజుకు ఎంత వ్యాపారం జరుగుతుంది.. ఏడాది ఆదాయం ఎంత వస్తుంది వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం ఉత్పత్తుల కేంద్రాన్ని పరిశీలించి ప్రతి రైతు బజారులో ఇలాంటివి ఏర్పాటు చేయాలని కలెక్టరుకు చెప్పారు.

సీఎం దిశా నిర్ధేశంతో జిల్లా ప్రగతి

సీఎం చంద్రబాబు దిశా నిర్ధేశంతో జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్నాం. జిల్లాలో ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర పక్కాగా అమలు చేస్తున్నాం. 4 లక్షల మందికిపైగా ప్రజలు, ఉద్యోగులు పాల్గొంటారు. పీ-4 కార్యక్రమంలో జిల్లాలో అమలు చేస్తున్నాం. జిల్లాలో 20 శాతం మంది ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించాం. 55 మంది మార్గదర్శుకులను కూడా ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేశాం. ముఖ్యమంత్రి విజన్‌ మేరకు ఈ పది నెలల్లో జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఓర్వకల్లు హబ్‌లో 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ నోడ్‌ వస్తుంది. వీటి ద్వారా 6 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి.

- పి.రంజిత్‌ బాషా, కలెక్టర్‌

పాణ్యంను ఆదర్శంగా తీర్చుదిద్దుతా

సీఎం చంద్రబాబు స్పూర్తి, సహకారంతో పాణ్యం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చుదిద్దుతా. ఓర్వకల్లుకు రూ.2,860 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించారు. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు మంత్రివర్గం, అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న సీఎంకు ధన్యవాదాలు. కల్లూరు అర్బన్‌ 16 వార్డుల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు గోరుకల్లు నుంచి పైపులైన్‌ వేయాలి. గోరుకల్లు, అలగనూరు రిజర్వాయర్లు మరమ్మతులు చేయాలి. విస్తరిస్తున్న కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయాలి. సఫా కాలేజీ నుంచి నంద్యాల చెక్‌ పోస్టు వరకు నాలుగు రోడ్ల రహదారి నిర్మించాలి. ఉర్దూ విశ్వవిద్యాలయం భవనాలు పూర్తి చేయాలి.

- గౌరు చరితారెడ్డి, ఎమ్మెల్యే

కాటసాని కబ్జాలపై విచారణ కమిటీ వేయాలి

వైసీపీ హయంలో పాణ్యం నియోజకవర్గంలో కబ్జాలు విచ్చలవిడిగా జరిగాయి. పది మంది టీడీపీ కార్యకర్తల్లో ఒకరి ఆస్తులు కబ్జాకు గురయ్యాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి. ఒక మహిళలను ఎంపీ చేయడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ కమిటీల్లో సభ్యురాలిగా చేర్చి గుర్తింపు ఇచ్చారు. రాయలసీమ సస్యశామలం చేయడానికి సీఎం చంద్రబాబు రేయింబవళ్లు కృషి చేస్తున్నారు.

- బైరెడ్డి శబరి, నంద్యాల ఎంపీ

Updated Date - May 18 , 2025 | 12:51 AM