ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పురాతన బావిలో పూడికతీత

ABN, Publish Date - Apr 10 , 2025 | 11:54 PM

ఒకప్పుడు ఊరందురూ ఆధారపడిన ఈ పురాతన బావి కాలక్రమేణ శిథిలావస్థకు చేరుకొని పూడిపోయింది.

నీటి ఎద్దడి నివారణ కోసం గ్రామస్థుల యత్నం

బావిలో నుండి బయటపడ్డ శిలా శాసనం

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు ఊరందురూ ఆధారపడిన ఈ పురాతన బావి కాలక్రమేణ శిథిలావస్థకు చేరుకొని పూడిపోయింది. అయితే ఇటీవల గ్రామంలో తాగు నీటి కొరత ఏర్పడింది. దీంతో గ్రామస్థులు పూడికతీత పనులు మొదలుపెట్టారు. కొలిమిగుండ్ల మండలంలోని నందిపాడు గ్రామంలోని చౌడేశ్వరి ఆలయం ముందున్న పురాతన బావిలో నాలుగు రోజులుగా గ్రామస్థులు పూడికతీత పనులు చేపడుతున్నారు. బావి బయట ప్రత్యేక యంత్రాన్ని ఏర్పాటు చేసి పూడికను తోడుతున్నారు. దీంతో మట్టిలో కూరుకపోయిన అద్భుతమైన పురాతన బావి కట్టడం బయటపడింది.

బయటపడ్డ శిలాశాసనం: బావి పూడికతీత పనుల్లో ఓ బండ రాయిపై రాసి ఉన్న శిలాశాసనం బయట పడింది. సంస్కృతంలో రాసి ఉన్న శిలాశాసనం చౌడేశ్వరీ ఆలయ చరిత్రను తెలిపేదని స్థానికులు పేర్కొంటున్నారు. పురావస్తు అధికారులు ఈ రాతను వివరించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:55 PM