ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ చంద్రశేఖర్
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:49 PM
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ చంద్రశేఖర్
ఆమోదం తెలిపిన గవర్నర్
కర్నూలు హాస్పిటల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్స్‌లర్‌గా కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ పుల్లాల చంద్రశేఖర్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఫారసుతో వైస్ చాన్స్‌లర్‌గా పి.చంద్రశేఖర్‌ను ప్రభుత్వం నియమించింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అంచెలంచెలుగా వైస్ చాన్స్‌లర్ పదవిని అధిరోహించారు. రాయలసీమ ప్రాంతం నుంచి మొదటిసారిగా డాక్టర్ పి.చంద్రశేఖర్ ఈ పదవిలో నియమితులు కావడం విశేషం. చంద్రశేఖర్ ఎంబీబీఎస్‌ను 1977-83 ఎండీ జనరల్ మెడిసిన్, రెండు కర్నూలు మెడికల్ కాలేజీలో డీఎం కార్డియాలజీ వేలూరులో పూర్తి చేశారు. 1997 నుంచి 2003 వరకు కర్నూలు మెడికల్ కాలేజీలో కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 1997-2003 వరకు పని చేశారు. 2003-2008 వరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా 2008 నుంచి 2023 వరకు ప్రొఫెసర్‌గా పని చేశారు. 2017-2019 వరకు కర్నూలు కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా, 2019-2020 వరకు ప్రిన్సిపాల్‌గా పని చేసి అదనపు డీఎంఈ ప్రొఫెసర్ అండ్ హెచ్‌వోడీగా, 2023లో పదవి విరమణ పొందారు. 2024 మే 1న టీచింగ్ ఫ్యాకల్టీ కింద ప్రొఫెసర్‌గా చేరారు. 2025 ఏప్రిల్ 24న వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.
Updated Date - Apr 24 , 2025 | 11:49 PM