అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దు
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:07 PM
అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దని ఫారెస్టుశాఖ డిప్యూటీ డైరెక్టరు అనురాగ్‌మీనా అన్నారు.
పరిశీలిస్తున్న అనురాగ్‌మీనా
డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్‌మీనా
రుద్రవరం, జూలై 25 (ఆంధ్రజ్యోతి): అడవుల సంరక్షణలో నిర్లక్ష్యం వద్దని ఫారెస్టుశాఖ డిప్యూటీ డైరెక్టరు అనురాగ్‌మీనా అన్నారు. శుక్రవారం రేంజ్ పరిధిలోని బోరింగ్ బేస్‌క్యాంపును ఆయన సందర్శించారు. ప్రొటెక్షన్ వాచర్లతో అటవీ సంరక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్విరాన్‌మెంట్ చెక్‌పోస్టు వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. రుద్రవరంలో నర్సరీని పరిశీలించారు. మొక్కలు పెంపకం త్వరితగతిన చేయాలని సూచించారు. నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జ్ రేంజర్ ముర్తుజావలి, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 11:07 PM