మహిళల జోలికొస్తే ఖబడ్దార్
ABN, Publish Date - Jun 10 , 2025 | 12:39 AM
రాష్ట్ర రాజధాని అమరావతి, మహిళల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ నంద్యాల జిల్లా టీడీపీ అఽధ్యక్షుడు, టీటీడీ మెంబర్ మల్లెల రాజశేఖర్ హెచ్చరిం చారు. సోమవారం సాక్షి కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేసి జగన్ దిష్టిబొమ్మను, సాక్షి పేపర్ ప్రతులను దహనం చేశారు.
నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్
సాక్షి కార్యాలయం ఎదుట జగన్ దిష్టిబొమ్మ దహనం
కల్లూరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతి, మహిళల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ నంద్యాల జిల్లా టీడీపీ అఽధ్యక్షుడు, టీటీడీ మెంబర్ మల్లెల రాజశేఖర్ హెచ్చరిం చారు. సోమవారం సాక్షి కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేసి జగన్ దిష్టిబొమ్మను, సాక్షి పేపర్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా మల్లెల మాట్లాడుతూ ఈనెల 6న సాక్షి టీవీ డిబేట్‌లో రాజధాని మహిళలను వేశ్యలుగా పేర్కొన్న కొమ్మి నేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుపై సుమోటోగా కేసు నమోదుచేసి కోర్టులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ మహిళా నాయకులు, భారతీరెడ్డి కూడా అక్కడే నివాసం ఉంటున్నారని గుర్తుంచుకోవాలన్నారు. జగన్ కళ్లల్లో ఆనందం కోసం కొందరు పనికట్టుకొని మహిళలపై మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత వైసీపీ పాలనలో అమరావతిపై జగన్ కక్ష సాధించారని, అదే పంధాను ఇప్పుడు కొనసాగిస్తూ వివక్ష చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలు, టీడీపీ నాయకుల జోలికి వస్తే ఇళ్లలోకి వచ్చి కొడతామని మల్లెల హెచ్చరించారు. కార్యక్రమంలో కల్లూరు మండల టీడీపీ కన్వీనర్ డి.రామాంజనేయులు, వాకిటి మాదేష్, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Jun 10 , 2025 | 12:39 AM