ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రాణం పోసిన వైద్యులు

ABN, Publish Date - May 14 , 2025 | 12:30 AM

ఓ యువకుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి కర్నూలు సర్వజన వైద్యశాల సర్జరీ వైద్యులు ప్రాణం పోశారు.

రోగులతో ఐదో యూనిట్‌ వైద్యులు

43 రోజుల తర్వాత రోగి డిశ్చార్జ్‌

కర్నూలు హాస్పిటల్‌, మే 13(ఆంధ్రజ్యోతి): ఓ యువకుడికి అరుదైన శస్త్రచికిత్స చేసి కర్నూలు సర్వజన వైద్యశాల సర్జరీ వైద్యులు ప్రాణం పోశారు. బండి ఆత్మకూరుకు చెందిన షేక్‌ తౌఫిక్‌ అనే యువకుడు నంద్యాలలో ఐటీఐ చదువుతున్నారు. రంజాన పండుగకు ముందు రోజు స్నేహితులతో కలిసి బైక్‌లో వెళ్తూ ఎక్సకవేటర్‌ను ఢీకొట్టాడు. పొట్టభాగం ఛిద్రమైంది. కడుపు పగిలి ప్రేగులు, డియో డినం దెబ్బతిన్నాయి. కటి ఎముక, వెనుక కిడ్నీ దాకా భాగం కూడా దెబ్బతింది. అదే రోజు రాత్రి నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు యువకుడికి ఆపరేషన జనరల్‌ సర్జరీ యూనిట్‌ చీఫ్‌ డా.మాధవీ శ్యామల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.చంద్రా రెడ్డి, డా.శృతి, అనస్థీషియా వైద్యులు డా.సోమశేఖర్‌ నేతృత్వంలో ఆపరేషనను విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాన్ని కాపాడారు. ఐసీయూలో 20 రోజులు ఉంచి రోగికి వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత వార్డుకు షిఫ్ట్‌చేసి రోగికి సేవలు అందించారు. రోగి కోలుకోవడంతో 43 రోజుల తర్వాత సర్జరీ ఐదవ యూనిట్‌ చీఫ్‌ ప్రొఫెసర్‌ డా.మాధ వీశ్యామల విలేకరుల సమావేశాన్ని నిర్వహించి వివరించారు. 43 రోజులు వైవ్యసేవలు చేసి యువకుడైన రోగి ప్రాణాన్ని కాపాడటం చాలా సంతోషంగా ఉందన్నారు.

కదిరి విద్యార్థికి అరుదైన ఆపరేషన: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన టి.వేణుగోపాల్‌ (15) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈబాలుడికి పుట్టుకతో మలద్వారం లేదు. చిన్నప్పుడే ఆపరేషన చేసినా ఇబ్బంది పూర్తిస్థాయిలో తొలగలేదు. ఇటీవలే కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ఐదో యూనిట్‌లో చేరాడు. యూ నిట్‌ చీఫ్‌ డా.మాధవీ శ్యామల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.చంద్రారెడ్డి, డా.శృతి నేతృత్వంలో బాలుడికి అనలెక్టమీ అనామి సమస్యకు ఆపరేషనను ఈ నెల 7వ తేదీన విజయవంతంగా నిర్వహించారు. మలద్వారాన్ని పెద్దగా చేసి కండరాలను బలోపేతంచేసి ఆపరేషన చేశారు. ఈ సందర్బంగా డా.మాధవీశ్యామల మాట్లాడుతూ మలద్వా రం సమస్యను పుట్టిన వెంటనే నిర్వహిస్తారని, అలాంటిది 15 ఏళ్ల తర్వాత ఆపరేషన చేయడం చాలా అరుదు అని తెలిపారు.

Updated Date - May 14 , 2025 | 12:30 AM