భూసార పరీక్షలు చేయించండి
ABN, Publish Date - May 03 , 2025 | 11:24 PM
రైతులు పొలానికి భూసార పరీక్షలు చేయించాలని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి సూచించారు. శనివారం మండలంలో కలగొట్ల రైతు సేవా కేంద్రంలో భూసార పరీక్షల ఆవశ్యకతపై రె అవగాహన కల్పించారు.
జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి
వెల్దుర్తి, మే 3(ఆంధ్రజ్యోతి): రైతులు పొలానికి భూసార పరీక్షలు చేయించాలని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి సూచించారు. శనివారం మండలంలో కలగొట్ల రైతు సేవా కేంద్రంలో భూసార పరీక్షల ఆవశ్యకతపై రె అవగాహన కల్పించారు. భూసార పరీక్షలకు మే నెల సరైనదని, భూసారపరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడి పంటకు పోషకాలు అందించవచ్చునన్నారు. కౌలు రైతులకు 11 నెలల కాలపరిమితితో కౌలుకార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కౌలుకార్డుల పొందిన రైతులకు భూమిపై ఎలాంటి హక్కులు ఉండవన్నారు. రైతుసేవా కేంద్రంలో కౌలుకార్డులు పొందాలన్నారు. ఆహార,పోషకాహార భద్రత పథకం కింద రైతులకు 50శాతం రాయితీతో వేపనూనె, పురుగు మందులను, పిచికారీ యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ మోహన్ విజయ్‌కుమార్, ఏవో అక్బర్ బాషా, సర్పంచ్ మద్దిలేటి, సిబ్బంది పాల్గొన్నారు.
అంతర పంటలు సాగు చేయండి
రైతులు ఏక పంటలు వేయకుండా అంతర పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి సూచించారు. శనివారం గ్రామంలో పీఎండీఎస్ విత్తనాలు పంపిణీ చేశారు. ఎకరా పొలంలో పీఎండీఎస్ విత్తనాలు వేసుకొని కలియదున్నడం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు తెలియజేశారు. ఏక పంట వేయకుండా అంతరపంటలు, సరిహద్దు పంటలు, ఎర పంటలు ప్రకృతి వ్యవసాయ పద్దతిలో సాగుచేయాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గిం చాలని తెలిపారు. గ్రామానికి చెందిన రైతు పరమేశ్వరుడు అర ఎకరంలో బీజామృతంతో శుద్దిచేసిన 32 రకాల పీఎండీఎస్ విత్తనాలను జిల్లా వ్యవసాయాధికారి సమక్షంలో పొలంలో వేశారు. అనంతరం రైతులకు పీఎండీఎస్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏడీఏ మోహన్ విజయ్‌కుమార్, ఏవో అక్బర్‌బాషా, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది జనార్ధన్, పరమేశ్వరుడు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 11:24 PM