రామ్‌కో పరిశ్రమ వద్ద ఉద్రిక్తత..
ABN, Publish Date - Jul 08 , 2025 | 01:15 AM
రైతుల సమస్యలపై సోమవారం చర్చలు జరుపుతామని వారం క్రితం చెప్పిన రామ్‌కో పరిశ్రమ ప్రతినిధులు రైతులను ఆ ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
చర్చలకు వచ్చిన రైతులను అడ్డుకున్న పోలీసులు
నిరసనకు దిగిన సీపీఐ నాయకులు, రైతులు
కొలిమిగుండ్ల, జులై 7 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలపై సోమవారం చర్చలు జరుపుతామని వారం క్రితం చెప్పిన రామ్‌కో పరిశ్రమ ప్రతినిధులు రైతులను ఆ ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయడు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సుంకయ్య, జిల్లా రైతు సంఘం నాయకులు సోమన్న ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున రామ్‌కో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసులు భారీగా మొహరించి, రైతులను పరిశ్రమ రహదారిలోకి కూడా అనుమతించకపోవడంతో వాగ్వాదం నెలకొంది. దీంతో సీపీఐ నేతలు, రైతులు అక్కడే భైఠాయించి ఽధర్నా చేశారు. అనంతరం పోలీసుల జోక్యంతో ఐదుగురిని లోపలికి అనుమతించి చర్చలు జరిపారు. చర్యలు విఫలం కావడంతో సీపీఐ నేతలు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన పరిశ్రమ వర్గాలకు ఏమాత్రం కనిపించడంలేదని విమర్శించారు. గతంలో చెప్పినట్లే యజమాన్యానికి తెలియజేస్తామంటూ పాతపాటే పాడుతు న్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 08 , 2025 | 01:15 AM