మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - May 26 , 2025 | 12:04 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేశ నలుమూలల నుంచి దర్శనార్థం వచ్చిన భక్తులతో మార్మోగింది.
రాఘవేంద్ర స్వామి దర్శనానికి మూడు గంటల సమయం
మంత్రాలయం, మే 25(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేశ నలుమూలల నుంచి దర్శనార్థం వచ్చిన భక్తులతో మార్మోగింది. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీమఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు అశేష భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అన్నపూర్ణ భోజనశాల, మహా ముఖద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్ర నదీతీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాల మ్మను దర్శించుకొని రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేకపూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. సీఐ రా మాంజులు, ఎస్‌ఐ శివాంజల్, పోలీసులు, సెక్యూరిటీ ఆధ్వర్యంలో శ్రీమఠం ప్రాంగణంలో క్యూలైన్లు అదనంగా ఏర్పాటుచేశారు. ప్ర సాదాల కొరత రాకుండా ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు సురేష్ కోణాపూర్, శ్రీపతి ఆచార్ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దర్శనం మూడు గంటలు సమయం పట్టింది. మఠం ప్రాంగణంలో నలుదిక్కులూ పీఠాధిపతి ఆదేశాల మేరకు తొక్కిసలాట జరగకుండా శ్రీమఠం అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
Updated Date - May 26 , 2025 | 12:04 AM