శ్రీశైల క్షేత్రానికిపోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Apr 28 , 2025 | 12:36 AM
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం భ్రమరాంబమల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు వచ్చారు.
స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు
సున్నిపెంట, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం భ్రమరాంబమల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయంలోని క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల దర్శనార్థం ఆదివారం ఉదయం 3గంటలకు ఆలయం తలుపులు తెరిచారు. స్వామిఅమ్మవార్లకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనార్థం ఆలయంలోకి అనుమతించారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో దేవస్థానం ఏర్పాటుచేసిన క్యూకాంప్లెక్సు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు దేవస్థానం వారు తాగునీరు, అల్పాహారం అందజేశారు. తెలుగు రాష్ర్టాల నుంచేకాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు శ్రీశైలానికి తరలివచ్చారు. సుమారు 40వేల మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయాధికా రులు తెలిపారు.
స్వామి, అమ్మవార్లకు పల్లకీ సేవ
భ్రమరాంబమల్లికార్జున స్వామివార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. ఉత్సవ మూ ర్తులను వెండి పల్లకీలో ఆశీనులను చేసి ఆలయ వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపహారతులు సమర్పించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల పల్లకీ సేవతో ఆలయ ప్రాంగణంలో ఉత్సవం నిర్వహించి కల్యాణం జరిపించారు.
వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు
ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రత్యేకపూజలు చేశారు. ఈపూజల్లో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేక ం నిర్వహించారు. వీరభద్రస్వామికి జరిగిన పరోక్ష పూజల్లో కర్ణాటక, పంజాబ్, పశ్చిమబెంగాల్, బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీ యులు పాల్గొన్నారు.
Updated Date - Apr 28 , 2025 | 12:36 AM