శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Jul 27 , 2025 | 11:49 PM
భ్రమరాంబిక మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు శీశైలానికి పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా వివిధప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన భక్తులు
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): భ్రమరాంబిక మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు శీశైలానికి పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా వివిధప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్య స్నానమా చరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మర ణతో ఆలయం మార్మోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు తాగునీరు, అల్పహారాన్ని అందించారు.
Updated Date - Jul 27 , 2025 | 11:49 PM