డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
ABN, Publish Date - Jul 29 , 2025 | 10:37 PM
క్లస్టర్ యూనివర్సిటీలో డిగ్రీ 2, 4 సెమిస్టర్ ఫలితాలను ఇన్‌చార్జి ఉపకులపతి వెంకట బసవరావు విడుదల చేశారు.
కర్నూలు అర్బన్, జూలై 29(ఆంధ్రజ్యోతి): క్లస్టర్ యూనివర్సిటీలో డిగ్రీ 2, 4 సెమిస్టర్ ఫలితాలను ఇన్‌చార్జి ఉపకులపతి వెంకట బసవరావు విడుదల చేశారు. మంగళవారం రాయలసీమ యూనివర్సిటీ(ఆర్‌యూ)లోని ఆయన చాంబర్లో రిజిష్ట్రార్ కట్టా వెంకటేశ్వ ర్లుతో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ 2 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు సంబందించి 2వ సెమి స్టర్‌లో 939కి 532మంది, 4వ సెమిస్టర్‌కు 82 మంది పరీక్షలు రాయగా590 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో ఆర్‌యూ రిజిష్ట్రార్ బోయ విజయకుమార్ నాయుడు, క్లస్టర్ పరీక్షల విభాగం కంట్రోలర్ డాక్టర్ నాగరాజ్‌శెట్టి పాల్గొన్నారు.
Updated Date - Jul 29 , 2025 | 10:37 PM