డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలి
ABN, Publish Date - Jul 16 , 2025 | 12:58 AM
డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లా డిమాండ్ చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లా
కర్నూలు అర్బన, జూలై 15(ఆంధ్రజ్యోతి): డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లా డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అబ్దుల్లా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలై 3 నెలలు కావస్తున్న ఇప్పటివరకు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ నిర్లక్షం స్పష్టంగా అర్థ మౌతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం డిగ్రీ ఆనలైన విధానం ద్వారా లక్ష లాది మంది విద్యార్థులు తమకు ఇష్టమైన డిగ్రీ కళాశాలల్లో చేరలేక పోయా రని, మేజర్, మైనర్ విధానం ద్వారా చాలా మంది విద్యా ర్థులు తమకు నచ్చిన గ్రూప్‌లను ఎంచుకోలేకపోయారని, వెంటనే అడ్మిషన్లు ప్రారంభించా లని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, నాయకులు అబూబకర్, సాయి ఉదయ్, అమర్, రామకృష్ణ, మల్లేష్ పాల్గొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 12:58 AM